Wednesday, March 29, 2023

శివోహం

శివా!నీ కొలువుకు కొండలే ఒప్పునన్న
అహమను కొండ నాలో ఎదిగి వుంది
ఒదిగి పోవగరమ్ము ఎకముఖమున
మహేశా . . . . . శరణు .

Tuesday, March 28, 2023

శివోహం

చల్లని హిమగిరి పైన కూర్చుని ఉన్నావు...
చెల్లని మా బ్రతుకులను చూస్తూ ఉన్నావు...
మాపై ఇంత నిర్దయ ఏలనయ్యా...
ఇకనైనా మము కావగ రావయ్యా...
మా హృదయాలకు ఇంత వేదనెందుకయ్యా...
ఈ లోకంలో నీకన్నా మాకెవరయ్యా...
మనసా వాచా కర్మణా నిను నమ్మితి కదయ్యా....
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!చతుర్ధశి నాడు జాగరముంటా
చతురావస్థకి నన్ను చేరువ చేయమంటా
చక్ర బంధము నుండి విముక్తి నీయమంటా
మహేశా . . . . . శరణు.

Monday, March 27, 2023

శివోహం

పుట్టుట గిట్టుట కొరకే అని అంటారు. చావు లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా ఉండాలి.
అది భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, భగవంతుడి అనుగ్రహం ద్వారా జరగాలి.
అందుకే మనం నిత్యం ఆ పరమాత్ముని ఆరాధించాలి.
మేఘం వలన నెమళ్ళు పురివిప్పి ఆనందంగా నాట్యం చేస్తాయి.
అలాగే పరమాత్ముని ధ్యానములో మనం కూడా నెమళ్ళ లాగా ఆనందంగా వుండాలి

శివోహం

శివా!నాలో శ్వాసగా మెలిగేవు
నాలో స్పురణగా మెరిసేవు
నాలో స్మరణగా నలిగేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
మనసునిండా చీకటి రంగు...
కనులనిండా కన్నీటిరంగు...
బాధే బాధపడే బ్రతుకు ఇది...
దయ చూడరాదు...
నా కోరికను మన్నించారాదు...
నీ కైలాసం లో కాస్తంత చోటు కల్పించారాదు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

"మంచిమాటలు"
అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబారలలో కాదు.
అఖిల ప్రపంచంలో అసలైన అందం మనిషి హృదయంలో పరిమళించే పవిత్రతలోనే ఉంటుంది.
అజేయశక్తి భౌతిక సామర్ధ్యం నుంచి గాక, దృఢ దీక్ష నుంచి జనిస్తుంది.
అద్భుతాలను సాధించాలనుకునే వ్యక్తికి అనంతమైన సహనం అవసరం.
అలవాట్లు మానవుణ్ణి కబళిస్తాయి. కనుక ఆలోచించి చెడు అలవాట్ల నుండి మనం  తప్పించుకోవాలి.

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...