Monday, April 3, 2023

శివోహం

అంతటా తానై...
అన్నీ తానై...
అందరిలో తానై...
ప్రాణుల మనుగడకు...
సృష్టి  స్తితి లయాలకు...
కాలచక్ర భ్రమనానికి కారణ భూతమై...
సూర్య చంద్రుల రూపంలో...
కళ్ళ ముందు నిత్యం వెలుగొందుతూ దర్శన మిస్తు...
నిత్యం నన్ను కాపాడే నా స్వామి సదా శివుడే సదా నాకు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సకల భూతనాధుడును...
తారక బ్రహ్మస్వరూపుడును...
గిరీశుడును...
పార్వతినందనుడును...
పరమేశ్వర పుత్రుడును...
సర్వపాపములను నాశనముచేయువాడు అయిన  శాస్తా వారిని నేను నమస్కరించు చున్నాను.

శివోహం

కఠిన దుఃఖ బాధలైనా...
గుండెల్లో ఊపిరి భరువైనా...
స్థితి గతులే మారినా...
నీ ఆరాధన ఆపను...
నీ ధ్యానం అపను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

*ఆధ్యాత్మికత*

భగవంతుని ఆలోచనలో సదా జీవించగలిగితే ప్రాపంచిక బాధలకు, వ్యాధులకు పరిష్కారం కనుగొనబడుతుంది.

భౌతిక ప్రపంచంలోనే జీవనాన్ని కొనసాగిస్తే అప్పుడు మనం వికలాంగులమనే చెప్పుకోవాలి. 

ఆధ్యాత్మికత అనే మూల బీజం నుండి విడివడనంత వరకూ మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా కొనసాగించవచ్చు.

ఆధ్యాత్మికత నుండి విడివడితే మనం ఎంతో కాలం మనలేము. 

శాశ్వతుడైన భగవంతుని ఉనికిని తెలుసుకో గలిగితేనే జీవితం పరిపూర్ణత్వాన్ని సాధిస్తుంది. 

అప్పుడు ఇంక కొరత అంటూ ఏదీ ఉండదు. 

సర్వమూ లభిస్తుంది.
============================

శివోహం

*"మంచిమాటలు"*

*ఎవర్ని ఆశ్రయించి జీవిస్తున్నాడో వారిని ఆడిపోసుకోకూడదు.*

*చెడ్డవాళ్ళ స్నేహంకంటే మంచి వాళ్ళతో విరోధం మేలు.*

*చేయవలసిన పనులు తెల్లవారు ఝామున ఆలోచించాలి.*

*ఎక్కడ సుఖంగా నివసించగలుగుతాడో అదే సరైన స్థానం.*

*విశ్వాసఘాతకుడికి ప్రాయశ్చిత్తం లేదు.*

Sunday, April 2, 2023

శివోహం

భగవంతుని స్మరించడానికి సమయమే ఉండదు...
ఇలా సమయం దొరకడం లేదని వాపోయేవారు ఒక్కసారి తమని తాము పరిశీలించుకొండి...
తమ దినచర్యలో ఎంత సమయాన్ని అనవసర విషయాలకై వృధా చేస్తున్నారో గమనించండి.
ఫోన్ మాట్లాడడానికి, టి.వి చూడడానికి, షికార్లు తిరగడానికి, కాలక్షేప కబుర్లుకు సమయముంటుంది కానీ, భగవన్నామ స్మరణకు మాత్రం సమయం ఉండదు కదా.
ఒకటి గుర్తించండి - గృహస్థులు రోజులో కొద్దిసమయం సాధనకు కేటాయిస్తే వచ్చే ఫలితం, రోజంతా సాధన చేసే సాధువుల ఫలితంకు సమానంగానే వుంటుంది. 'నిరంతరం భగవన్నామన్ని గానం చేసే నారదుడి కన్నా, ఉదయం నిద్ర లేస్తున్నే ఓసారి, తింటున్నప్పుడు ఓసారి, రాత్రి నిద్రపోయేటప్పుడు ఓసారి భగవన్నామన్ని స్మరించే రైతు గొప్పవాడు' అని పెద్దలు చెప్పిన కధ గుర్తు చేసుకొండి. మనస్సుంటే మార్గం వుండదా? అభ్యాసం చేస్తే ఏది సాధ్యం కాకపోదు. సంసార విధులను నిర్వర్తిస్తూ కూడా, మనస్సును భగవంతునిపై ఉంచడం అలవర్చుకోవచ్చు...
ప్రయత్నించండి మరి. 

శివోహం

శివా!నిను చేరు నా పయనంలో
అడుగు అడుగున నీ స్మరణమే
ప్రతి బంధమూ ప్రతిబంధకమే..
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...