Friday, April 14, 2023

శివోహం

భగవత్ సన్నిధికి చేరుకొనుటకు నామస్మరణ ఎంతటి ముఖ్యమో సేవలు కూడా అంతే ముఖ్యం. నామస్మరణ , సేవలు ఈ రెండూ రైలు పట్టాల వంటివి. కేవలం ఒక పట్టా మీదుగా పోతే రైలు తన గమ్యస్థానం చేరుతుందా?  రెండు పట్టాలు మీదుగా వెలితేనే గమ్యస్థానం చేరుకొగలదు. అదే విధముగా మనం భగవత్సన్నిధికి చేరుకోవాలంటే నామ స్మరణతో పాటు  సేవలు కూడా చేస్తుండాలి. అపుడే ప్రయాణం సులభమౌతుంది. శీఘ్రముగా భగవంతుని సన్నిధికి చేరుకొనుటకు అవకాశం ఉంటుంది.

ఓం నమో నారాయణ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నాకు స్మరణము నీవే
నాకు స్పురణయు నీవే
సకల దుఃఖ హరణమూ నీవే
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ దేవుడు గొప్పవాడా...
ఆ దేవుడు గొప్పవాడా...
లేదా దేవత గొప్పదా?  భక్తి మార్గం గొప్పదా...
ధ్యాన మార్గం గొప్పదా?
ఈ మంత్రమా ఆ మంత్రమా ఏది గొప్పది?
రాముడా... శివుడా... కృష్ణుడా... అమ్మవారా...
ఈ మీమాంస వద్దు...
అందరూ  ఏకదైవమైన పరబ్రహ్మ వ్యక్తరూపాలే...
ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడే...
అలానే, అన్ని మార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం మార్గ నిర్దేశం చేసినవే...
అన్ని భగవంతుని అనుగ్రహసారం వచ్చినవే...
ఏది ఎక్కువా కాదు, ఏది తక్కువా కాదు...
ఎవరి అర్హతకు అణుగుణముగా వారిని ఆ మార్గంలో నిలుపుతాడు...
ఎవరిని ఆరాధించిన, ఏ మార్గాన్ని అనుసరించిన చివరికి అనంత హృదయవాసంలో అణగవలసిందే.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, April 13, 2023

శివోహం

శివా!నీ అడుగులకు నే మడుగులొత్త
నీవు అడుగు తీసి అడుగు వేయగలేవే
మరి నా కోరిక తీరేది ఎలా....?
మహేశా . . . . . శరణు .

శివోహం

అవగాహన అనేది అంతరంగం నుండి జనిస్తుంది. పవిత్ర ఆధ్యాత్మిక అవగాహన అనే జలం మన స్వభావాన్ని ప్రక్షాళనం గావిస్తుంది. 

ఇది నిజమైన అవగాహన అయినప్పుడే సాధ్యం. కానీ సిద్ధాంతంగా కాదు. ఇది భగవత్ సాక్షాత్కార ఫలితంగా అనుభవంలోకి వస్తుంది. 

జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది. ఇక సందేహాలకు, ప్రశ్నలకు తావేలేదు. ఆ పై మనలో అనుమానాలు అంచనాలు ఉండవు. 

ఒక నూతన చైతన్యం మనలో ఉదయించి తద్వారా అమరమైన సత్యాన్ని అవగాహనకు తెస్తుంది.

Wednesday, April 12, 2023

శివోహం

నా మనస్సు ఒక కోతిలాంటిది...
దానికి స్థిరం తక్కువ...
కోతి అడవుల్లో తిరిగితే...
నామనస్సనే ఈ కోతి ఎల్లప్పుడు మోహం అనే అడవుల్లో తిరుగుతు ఉంటుంది....
ఇది చాల చంచలమైనది....
తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతో ఉంటుంది...
నా స్వాధీనంలో లేదు....
దాన్ని అదుపులో ఉంచుకోవడం నాకు సాధ్యం కావడం లేదు...
నేను అశక్తుణ్ణి నువ్వు నా మనస్సు అనే కోతిని భక్తి అనే పగ్గాలతో గట్టిగా బంధించి నీ అధీనంలో ఉంచుకో...
నీకు భుక్తి నాకు ముక్తి రెండూ లభిస్తాయి.
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీ చెలిమి మించిన కలిమి
"నేను"మించిన నిత్యము
కలవా కలనైనా పరమునైనా
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...