Tuesday, April 25, 2023

శివోహం

శివా!ఆది భిక్షుని చేరి అడుగుచుంటి
జ్ఞాన భిక్షను నాకు ఒసగమంటి
క్షమా భిక్షను కోరి శరణమంటి
మహేశా ..... శరణు.

Monday, April 24, 2023

శివోహం

కాలు కదిపితే ఆటట...
నీ కన్ను తెరిస్తే మంటట...
నీ నాటకాన మేమంతా నటులట...
ఒట్టు ఒట్టు మేమంతా వట్టి చీమలమట...
ఈ ఆటయ్యాక చేరేది నీ గూటికేనట...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!స్పురణ, స్మరణ,కరుణ
అన్నింటా వెలిగేవు వెన్నంటి మసలేవు
వేయి నామాల మాకు వేల్పువైనావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో!!!ఈ మాయామోహ జగత్తులో...
సంసారం అనే సముద్రంలో వివశులై...
దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...
అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు...
మానవజన్మ ఉద్దరణకు కావలసిన  సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని నువ్వే కలుగజేయాలి...

మహాదేవా శంభో శరణు...

Sunday, April 23, 2023

శివోహం

శివా!కొత్త జన్మలు కోరు కర్మలున్నాయి
పాత కర్మల ఫలము పండివున్నాయి
కర్మ ఫలములు కడతేర్చి కావుమయ్యా
మహేశా . . . . . శరణు .

Saturday, April 22, 2023

శివోహం

సర్వస్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే
భయే భస్ర్తాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే.

దుర్గా అనే నామం రెండే అక్షరాలూ అయినప్పటికీ,
ఆ నామానికిగల శక్తి అంతా ఇంతా కాదు.
సమస్త లోకాలను ఈ రెండు అక్షరాలే రక్షించగలవు.
ఆ తల్లి నామాన్ని అనునిత్యం స్మరించడం వలన సమస్త పాపాలు హరించబడతాయి.

అందుకే అంటారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం దుర్గాదేవినే నమః

శివోహం

పరమేశ్వరుడిని తప్ప తక్కిన దేవతలను కొలుచుట వలన ప్రయోజనం లేదు....
నిష్ఫలం కూడా..
సర్వేశ్వరుడిని వేడుకో...
చింతలు తొలగించుకో 
అన్యుని కొల్చినా ఫలితంలేదని తెల్సుకో...
ఎంత ఎగిరినా నేలను విడువవు మిత్రమా...
వరదలో చింతపండులా అవుతావు...
శివుడొక్కడే రక్షించునని తెలుసుకో
ఏ ఒక్కరూ రక్షించరని తెలుసుకో..
ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...