Monday, May 1, 2023

శివోహం

నిజమైన నేను ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి
ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ముక్కంటి అంటే ఏమో అనుకున్నా
రెండు కనులు అర్పించిన గానీ...
నా మూడవ కన్ను విచ్చుకోనీయవా
మహేశా . . . . . శరణు

శివోహం

శివా!ముక్కంటి అంటే ఏమో అనుకున్నా
రెండు కనులు అర్పించిన గానీ...
నా మూడవ కన్ను విచ్చుకోనీయవా
మహేశా . . . . . శరణు

శివోహం

శివ...
కలసి మెలసి జీవిస్తాము...
నలుగురుతో పాటు శ్రమిస్తాము...
భద్ధకమును వదిలేస్తాము...
అధిక నిద్రను మరుస్తాము...
పకృతి ననుసరించి ప్రవర్తిస్తాము...
మధ్యాహ్నం భోజనం వదిలేస్తాము...
ఐనా ప్రతి పనిలో నిన్నే తలుస్తాము...
మహాదేవా శంభో శరణు...

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయలకు కార్మిక(మే డే) దినోత్సవ శుభాకాంక్షలు.

Sunday, April 30, 2023

శివోహం

నీతలపే నాబలం...
నీ నామమే నాకు వరం...
నీ చూపులే నామార్గమై...
ని మౌనమే  నాకు సంకేతమై...
నీ కరుణ యే నాకు అర్హతయే...
నీ సేవయే నాకు ఆరాధనా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అమ్మను నీవు సగమైతే అర్ధనారీశ్వరం
హరిని కూడి నీవుంటే హరిహర ప‌రబ్రహ్మము
నేను నీవు వొకటైతే మరి కానరాదు భేదము
మహేశా . . . . . శరణు .

శివోహం

నీ మహిమలు విని కీర్తించి స్మరించినాను...
నీ స్వరూపనికి నమస్కరించి, అర్ధించినాము...
నా మనస్సులోని భక్తి భావాన్ని నివేదించినాము...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

  శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా మహేశా . . . . . శరణు. వెలుగువో నా ముందు ...