Saturday, May 6, 2023

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప....
శిరము వంచి ప్రణమిల్లి నిన్ను యాచిస్తున్నాను...
చావు పుట్టుకల చక్రబంధం లో చిక్కుకున్న నా మదిలో జన్మ జన్మకు ని పాదపద్మములు స్థిరంగా వుండునట్లు అనుగ్రహించుము చాలు...
అన్య కోరిక ఏమి కొరను...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శంకరా...
కేవలం నీకు మాత్రమే తెలుసు...
నా మనసులో జరిగే అలజడి ఏంటో...
నా మనసులో బాధ ఏంటో...
అప్పటికి ఇప్పటికి మారింది పరిస్థితిలు, పరిసరాలు మాత్రమే...
నేను కాదు శివ...
ఎన్ని కష్టాలు పెట్టిన ఎన్ని దుఃఖాలు నాకు కలిగిన...
నేను ఉచ్చరించే నామం నిదే 'శివ'...

మహాదేవా శంభో శరణు...

Friday, May 5, 2023

శివోహం

అఖిలం నిఖిలం ఆధారనిలయం 
అండపిండ బ్రహ్మాండ నాయకం 
సహస్రనామం శ్రీనిధిం శ్రీనివాసం
త్రిలోకాత్మం త్రిలోకేశం తిరునామం ప్రభద్దే.

ఓం నమో వెంకటేశయా.
ఓం నమో నారాయణ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఏ స్వరము ఏమి పలికినా
నా స్వరమున నీ పలుకే
అది వరముగ నా తలపే
మహేశా . . . . . శరణు .

Thursday, May 4, 2023

శివోహం

ఎదో ఒక శక్తి తనను కాపాడుతుంది అని నిజమైన భక్తుడికి తెలుస్తుంది...

అటువంటి నిజమైన భక్తుడి లో నే ఈశ్వరుడు కొలువై ఉంటాడు...

 ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నా కన్నీరు ఉప్పదనం కూడివున్నది
ఆ కన్నీటికి తీయదనం చేరాలని కోరికున్నది
నా కోరిక నీ చేరిక కోరుతున్నది .
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
ఉన్న విషయం చెప్పేస్తున్నాను...
తప్పో ఒప్పో నాకు తెలియదు...
తిన్న ఇంటి వాసాల లెక్క చూసే లెక్క నాది...
నా కోసం ఎంతో చేసిన నీకు కనీసం కృతజ్ఞత చెప్పకుండా దాటేసే తల తిక్క మానవజన్మ నాది...
కష్ట మొస్తేనే నిను తలుస్తున్నని ఏమి అనుకోకు శివ...
ఏం చేయను నేను...
నాది లేకుంటే నేను లేను...
నేను అనకుంటే బ్రతుకు లేదు...
ఏమైనా నీ దయ....
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...