Sunday, May 7, 2023

శివోహం

శివా!తోలు ముక్క కట్టి తిరుగాడు నీవు
తోలుతిత్తిని కూడి నన్ను తిరుగ జేసావు
తిరుగలేకున్నాను విరుగుడేదొ తెలియజెప్పు
మహేశా . . . . . శరణు .

శివోహం

పక్వమైన పండు చెట్టునుండి క్రిందబడితే, తిరిగి చెట్టుకు తగిలించి ఏమి ప్రయోజనం ?  అదే విధంగా జ్ఞానం వచ్చేదాకా కర్మలు చేస్తూ, పండుపక్వానికి ( పూర్తిజ్ఞానం ) వచ్చిన తరువాత కర్మలు తొలిగిపోతాయి.  అలాంటి జ్ఞానం కలిగినవారు అన్నింటినీ సమదృష్టితో చూస్తారు.   ప్రేమతో చూస్తారు. నిష్క్రియులై వుంటారు.

శివోహం

శోధన ఆనందం వద్ద ఆగాల్సిందే
శోధన ఆనందమై తీరాల్సిందే
రగిలినా,పొగిలినా
కలతయై కుమిలినా
జీవుని చివరి మజిలీ ఆనందమే
సాధన అసలు నైజం ఆనందమే

Saturday, May 6, 2023

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప....
శిరము వంచి ప్రణమిల్లి నిన్ను యాచిస్తున్నాను...
చావు పుట్టుకల చక్రబంధం లో చిక్కుకున్న నా మదిలో జన్మ జన్మకు ని పాదపద్మములు స్థిరంగా వుండునట్లు అనుగ్రహించుము చాలు...
అన్య కోరిక ఏమి కొరను...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శంకరా...
కేవలం నీకు మాత్రమే తెలుసు...
నా మనసులో జరిగే అలజడి ఏంటో...
నా మనసులో బాధ ఏంటో...
అప్పటికి ఇప్పటికి మారింది పరిస్థితిలు, పరిసరాలు మాత్రమే...
నేను కాదు శివ...
ఎన్ని కష్టాలు పెట్టిన ఎన్ని దుఃఖాలు నాకు కలిగిన...
నేను ఉచ్చరించే నామం నిదే 'శివ'...

మహాదేవా శంభో శరణు...

Friday, May 5, 2023

శివోహం

అఖిలం నిఖిలం ఆధారనిలయం 
అండపిండ బ్రహ్మాండ నాయకం 
సహస్రనామం శ్రీనిధిం శ్రీనివాసం
త్రిలోకాత్మం త్రిలోకేశం తిరునామం ప్రభద్దే.

ఓం నమో వెంకటేశయా.
ఓం నమో నారాయణ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఏ స్వరము ఏమి పలికినా
నా స్వరమున నీ పలుకే
అది వరముగ నా తలపే
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...