Wednesday, May 10, 2023

శివోహం

శివా!ప్రవృత్తి మార్గాన పుడమిని చేరి
నివృత్తి మార్గ మెరుగ నీకై వెతుకుచూ
తిరుగాడు చున్నాను తీరమెరుగక
మహేశా . . . . . శరణు .

Tuesday, May 9, 2023

శివోహం

బాధ లేనట్టి మనుజుడు కానరాడు ఈ లోకం లో...
బాధ పడువాడు ఎన్నడూ బాగుపడడు అనునది నిజమే...
బాధ లేని వాడసలు మనిషి కాడు...
కానీ బాధ పెట్టుట మాకు నీ పరీక్ష నే కాదా హర...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నరము లేనట్టి నాలిక నాకు ఇచ్చి..
నరము తెగిపోవు వేదన కల్పించినావు...
నరము బంధించలేని శివ భక్తిని ఇచ్చి
నరము శివ శివ అని పలుకు కృపను ఇవ్వు...
మహాదేవా శంభో శరణు.

Monday, May 8, 2023

శివోహం

ఈ జగతి మాయ అని నాకు తెలియదయ్యా...
మాయలో బ్రతుకు మాదని తెలియదయ్యా...
మాయ కాదిది బ్రహ్మ మని ఎరుగనైతి...
మాయ ఏదియో హర ఆ మర్మ మేదో చెపుమా తండ్రి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!వెలుగు కన్నై విరిసె విశ్వసాక్షి
చలువ కన్నుగ మెరిసె చంద్రమూర్తి
నిలువునా అజ్ఞానమును కాల్చె నిప్పుకన్ను
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నీవు మా ప్రాణికోటికి  దయతో  ఎడతెగకుండా వర్ధిస్తూ అనుగ్రహిస్తూ వస్తున్న నీ కృపా కటాక్షాలు  వర్ణించటానికి  మేము చాలా అల్పులం తండ్రి... అఙ్ఞానులం కడు పాపాత్ములమైన మాకు  నీ ఔదార్యాన్ని ఎన్న బూనడం సాధ్యమా ప్రభూ?...
మా అవివేకాన్ని నిత్యం ప్రదర్శిస్తూ ఉన్న మా  మిథ్యా బ్రతుకుల తీరు నీకు తెలియనిదా...

మహాదేవా శంభో శరణు.

Sunday, May 7, 2023

శివోహం

శంభో!!!ఈ మాయామోహ జగత్తులో...
సంసారం అనే సముద్రంలో వివశులై...
దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...
అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు...
మానవజన్మ ఉద్దరణకు కావలసిన  సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని నువ్వే కలుగజేయాలి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...