Friday, May 12, 2023

శివోహం

ప్రభు నరసింహ...
రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ...
నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు....
పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా?...
సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా!...
నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా!...
ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!!

ఓం నమో నారాయణ.
జై శ్రీమన్నారాయణ.

శివోహం

శివా!జీవాత్మగ తిరిగేను
పరమాత్మకై వెతికేను
గతివై గమ్యానికి చేర్చుమా
మహేశా . . . . . శరణు .

Thursday, May 11, 2023

శివోహం

ఏంటో లేవగానే కొంచెం మనశ్శాంతి ఇవ్వు దేవుడా అని రోజూ కోరుకోవాల్సి వస్తుంది...
ఈ గజిబిజి ,ఆరాట,ఆలోచనల బ్రతుకు పోరాటాల్లో మనశ్శాంతి కరువయ్యింది...
ఏదో తెలియని వేదన...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మనసు స్థిరము గాలేదు
స్వరమున నీ నామం స్మరించేదాకా
మనసున నీ గానం ఆలపించేదాకా
శ్వాస న ప్రణవనాదం నడయాడబడేదాకా
మదిన నీ రూపం నిలిచేదాకా
భక్తిని భిక్షగా స్వీకరించు ఆదిభిక్షువు జ్ఞానమొసంగు జ్ఞానప్రదాతవు
ముక్తిగోరు సర్వులకు ముక్తిప్రదాతవు
నీవు తప్ప అన్యులెవరూ లేరు
ముక్తిగోరి అంతర్యాగముయందు నీ పద సన్నిధి చేరితి సదాశివా

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!వరమడుగ నాకు వేలుపు నీవే
పదమిడగ నాకు పరము నీవే
శరణము నొసగెడి ఆ చరణము నీదే
మహేశా . . . . . శరణు .

Wednesday, May 10, 2023

శివోహం

నా మనసు కోతి వంటిది...
నిలకడ ఉండదు...
అన్నీ కావాలనుకొంటుంది...
ఎంగిలి చేసి వదిలేస్తుంది...
మనసు అనే కోతి అడవుల్లో పర్వతాలలో
కుదురు లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది.!
చెట్ల కొమ్మలపై పల్టీలు కొడుతుంది.!
దాన్ని అదుపు చేసి బంధించటం కష్టంగా ఉంది...
‌దానికి మోహం ఎక్కువ పరుగులు పెడుతూ ఉంటుంది...
నువ్వు భక్తి అనే జ్ఞాన భిక్షను పెట్టే ఆదిభిక్షువు కదా...
నా వశంలో లేని నా మనసును నువ్వే నీ భక్తి అనే త్రాడుతో బంధించి నీ స్వాధీనం చేసుకో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నారాయణ సుతుడు వచ్చి నిన్ను చూడ
చూపు తెలిసి ఆ సుతుని బుగ్గి చేసినావు
నా అజ్జానం నిన్ను చూసె కాల్చివేయుమా
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...