Tuesday, May 16, 2023

శివోహం

వెతలు లేని ఆస్థానం
వెదుకుతున్న జీవునికి
తన నివాస సంస్థానం
ఎరుక అయ్యింది అదే...
నాది అయినది సాటి లేనిది
ఎనలేని వెలలేని ఆనంద నిలయమది
సాకార జీవితానికావలైనది 
ప్రాకృత బంధ విముక్తమైనది 
మనోబద్ద విలాస నిహతమైనది
క్రమేపీ వెలుగు పెంచు వికాస మార్గమది
అతి సూక్ష్మమై యొప్పు దివ్య క్షేత్రమది
అప్రమేయ ప్రేమతత్వమైన శివ హృదయమిది..

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, May 15, 2023

శివోహం

ఈశ్వరుడు సాక్షి . అంతా ఈశ్వరేచ్ఛ అని అంటూ ఉంటాం అంటే...
ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు...
ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది... అది "ఈశ్వరేచ్ఛ"., ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు ఆయన సాక్షి,
కాబట్టే ఈ కర్మలు నమోదై , ఆయా ఫలితాలు పొందుతున్నాం. ఈ కర్మకి ఇది ఫలితం వస్తుంది అని నిర్దేశించాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!శబ్దాలను సృష్టించి నిశ్శబ్దంగా ఉన్నావు
నిశ్శబ్దంలో  శబ్దాన్ని తెలుసుకోమన్నావు
ఆ శబ్ధం తెలియగ  నిన్నే శరణమంటున్నా..
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
విషమును విషమని అందురు...
విషయము కూడా విషమట...
విషము విషయ వాసనయను...
విషయము ఎరిగించ రాదా గరళకంఠ...

మహాదేవా శంభో శరణు.

Sunday, May 14, 2023

శివోహం

భగవంతుదీని ఎంతలా ప్రార్ధించిన పలకడం లేదని అనకు...
నీవు చేసిన ప్రార్ధన త్రికరణశుద్దిగా ఉందో, లేదో గుర్తించు...
మనస్సు చలించేవారికి, మాటిమాటికి సందేహించేవారికి, కుతర్కం చేయువారికి ఏ మంత్రమూ ఫలించదు....
సాధకులకు శ్రద్ధ, విశ్వాసం ప్రధానం...
యాంత్రికంగా జపం చేయకూడదు...
యాంత్రికంగా చేస్తే మనకి , టేప్ రికార్డర్
కి తేడా ఉండదు కదా....
పరిపూర్ణ విశ్వాసంతో కదలని ప్రార్ధనలు పరమాత్మను చేరలేవు. స్పందన లేని సాధనలు ప్రతిస్పందన ఎలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి యొక్క ఆర్తనాదమును భగవంతుడు ఆలకించడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా ! ఆద మరచి నిదుర పోతే 
నిదుర లేపి నీవే ఉంటావు 
నిదుర ఆగి బెదిరి పోతే 
ఎదురు నిలిచి నీవై  ఉంటావు 
శివా ! నీ దయ

శివోహం

మనస్సు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా వుండదు....
అది దాని స్వభావం....
పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది...
అది ప్రకృతి నియమం...
అందుకే మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.... అనేక విషయ వాసనలతో నిండిపోతుంది...
కావున నామ మంత్రం ద్వారా మనస్సుని తిప్పగలిగితే, అంటే అంతర్ముఖమైతే విషయ చింతన తగ్గుతుంది...

జై శ్రీమన్నారాయణ...
ఓం నమో నారాయణ...
ఓం శివోహం... సర్వం శివమయం.

  శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా మహేశా . . . . . శరణు. వెలుగువో నా ముందు ...