Monday, May 22, 2023

శివోహం

శివా!భస్మదారణ ఒకటి నాదైన భాగ్యామై
నిత్య జాగరణ సాగె శివరాత్రి నెరుగ
ఎఱుక చేయవయ్యా ఆ ఒక్కరాత్రి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!మంచుకొండల చేరి మసలనేల
వెచ్చనైన నా గుండెను సేద తీరవేల
మచ్చికగా చెబుతున్నా మనసు నెరుగవేల
మహేశా . . . . . శరణు .

Sunday, May 21, 2023

శివోహం

శివా!మంచుకొండల చేరి మసలనేల
వెచ్చనైన నా గుండెను సేద తీరవేల
మచ్చికగా చెబుతున్నా మనసు నెరుగవేల
మహేశా . . . . . శరణు .

Saturday, May 20, 2023

శివోహం

శివా!నీ చెప్పుచేతల ఈ జగతి ఒప్పుచుండ
చేయ వచ్చితివేల ఈ చిప్ప వృత్తి
చేయవయ్యా మాకు సందేహ నివృత్తి
మహేశా . . . . . శరణు .

Friday, May 19, 2023

శివోహం

శివా!మాటకు మూరడు దూరంలో నీవు
మరి ఏలనో మా కంటికి కానరావు
ఏమిటి ఈ చమత్కారం ఏది పరిష్కారం
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నాతో ఆడుకోవాటినికి నీనుండి నన్ను దూరం చేసి కలియుగంలో పంపి దాగుడుమూతలాడుతున్నావు...

పోనీ నీ పాదాలు దొరికినవి కదా అని సంబరపడుతుంటే
అందాల ఆశ చూపి , సంపదలు చూపించి , బందం తో బందీని చేసి ఇక్కడ కూడా దూరమే చేస్తున్నావు...
ఎన్ని జన్మలైనవో ఈఆట మొదలుపెట్టి...
ముగుంపు నీయరా పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు...

Thursday, May 18, 2023

శివోహం

నిజమైన నేను ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి
ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...