Saturday, May 27, 2023

శివోహం

శివా!వెచ్చని కన్నీళ్ళు నీకభిషేకమొనరించి
వెనుదిరిగి నేను వెడలుచున్న వేళ
మధుర శీతల జలము మోము జారె
మహేశా . . . . . శరణు .

శివోహం

పెళ్ళైన కొత్తలో మోహం లేకుంటే
బంధానికి బద్దులవగలమా
పిల్లలపై వ్యామోహం లేకుంటే
విహిత కర్మలు చెయ్యగలమా
అవసరం మేరకే వ్యవహరించాలి
తన నిజతత్వం ఎరగాలి
రొంపిలో పడి కొట్టుకుంటూ
అందులో స్వర్గం వెతుక్కుంటూ
నిస్సహాయమై అలమటి‌ంచేకన్నా 
ప్రకృతి తత్వానికి తలవంచుట మిన్న
కాలానికి తగినట్లు నీ ప్రవృత్తిలో
మార్పు కలుగుటలేదా
సంంకల్పమే నీకుంటే సమయం పట్టినా
నియంత్రణ (self control)సాధ్యపడుటలేదా 
నిన్ను నీవు నియమించగలిగితే 
జీవించినంతవరకు గెలుపు నీదే
ఆనందానికి అంతిమ శ్వాస నీదే

శివోహం

తెలియదు ఇది నీ మాయని...
తెలియదు ఈ లోకమంత నీ మాయా మయమని...
తెలియదు నా అజ్ఞానమే మాయనీ...
తెలియదు నిను మరచుట మాయని...
తెలుపుము ఆ మాయా జ్ఞానము...
తెలుపుము ఆ మాయ తెర  తొలగు విధానము...
మహాదేవా శంభో శరణు.

గోవిందా

ఎక్కలేకున్నాను ఏడు కొండలు
దిక్కు నీవని కోరాను అండ దండలు
గోవిందా....గోవిందా..... గోవిందా .....గోవిందా

ఏడు కొండలెక్కు రీతి ఎదగలేకున్నాను
ముడుపులన్ని తీర్చక బ్రతకలేకున్నాను

బ్రతుకు తీరే రోజులు దగ్గరవుతున్నవి
మోపున ముడుపులు భారమవుతున్నవి

కానరాని బరువులు కూడు చున్నవి
మోయలేక బరువులు ములుగుచుంటిని

గోవిందా.......4                              "ఎక్క"

కన్నులెదిటి కొండలు కష్టపడి ఎక్కినా
కన్నులతో నీ రూపం కోరి కోరి చూసినా

స్థూలంగా అవి  ఏడు కొండలుగా ఉన్నా
అవి నాలోని చక్రాలకు నిజ సంకేతము

బాహ్యంలో నిన్ను కొలిచి మురిసిపోతున్నా
అంతరాన చక్రాలు అధిగమించలేకున్నాను

గోవిందా....4                                      "ఎక్క"

బుద్ది కాస్త వికసించి భాసించగనీయి
బద్దుడుగా ఉన్న నన్ను బుద్దునిగా చేయి

నా ఆశలన్ని తీరగ నీ బాస కూడనీయి
ఆ కూడిక నాలో తీసివేత కానీయి

గోవింద..... 4                             "ఎక్క"

Friday, May 26, 2023

శివోహం

ఆంజనేయం మహావీరం
బ్రహ్మ విష్ణు శివాత్మకం
అరుణార్కం ప్రభుం శమథం
రామదూతం నమామ్యహం

శివోహం

క్రిష్ణ...
వెన్న దొంగ వని నిన్నందురు...
కానీ నీ హృదయము వెన్నగ తెలియగలేరు వెర్రి జనాలు...
వెన్నవన్నెల చిన్నెల రేడా...
వెన్నెల  కన్నా మిన్నా నీవే కన్నా నీవే మిన్నా...
హరి శ్రీ హరి శరణు....

జై శ్రీమన్నారాయణ...
జై శ్రీరామ్...
జై శ్రీకృష్ణ....
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఏమి జేసితి నీ కొరకు నేను...
ఏమి జీసితి...
నను నీవు చూచు కొరకు...
ఏమి జేసిన వినిపించు నీకు నా ఆర్తి...
ఏమి చేయవలెనో నా వేదన నీకు తెలియ...
మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...