ఎక్కలేకున్నాను ఏడు కొండలు
దిక్కు నీవని కోరాను అండ దండలు
గోవిందా....గోవిందా..... గోవిందా .....గోవిందా
ఏడు కొండలెక్కు రీతి ఎదగలేకున్నాను
ముడుపులన్ని తీర్చక బ్రతకలేకున్నాను
బ్రతుకు తీరే రోజులు దగ్గరవుతున్నవి
మోపున ముడుపులు భారమవుతున్నవి
కానరాని బరువులు కూడు చున్నవి
మోయలేక బరువులు ములుగుచుంటిని
గోవిందా.......4 "ఎక్క"
కన్నులెదిటి కొండలు కష్టపడి ఎక్కినా
కన్నులతో నీ రూపం కోరి కోరి చూసినా
స్థూలంగా అవి ఏడు కొండలుగా ఉన్నా
అవి నాలోని చక్రాలకు నిజ సంకేతము
బాహ్యంలో నిన్ను కొలిచి మురిసిపోతున్నా
అంతరాన చక్రాలు అధిగమించలేకున్నాను
గోవిందా....4 "ఎక్క"
బుద్ది కాస్త వికసించి భాసించగనీయి
బద్దుడుగా ఉన్న నన్ను బుద్దునిగా చేయి
నా ఆశలన్ని తీరగ నీ బాస కూడనీయి
ఆ కూడిక నాలో తీసివేత కానీయి
No comments:
Post a Comment