Monday, May 29, 2023

శివోహం

నరము లేనట్టి నాలిక నాకు ఇచ్చి...
నరము తెగిపోవు వేదన కల్పించి నావు...
కడలి కెరటాల వడి వలె రాత్రి పగలు...
క్రమ్మి వేయుచు నుండే...
తేరుకొకమునుపే కనికరమ్మింత చూపదు నిను తలచ నీదు...
కరుణ జూపు హర విధి కాటు పడక ముందే...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అందరూ అంటారు నీ భక్తులమని
ఏ కొందరినో అంటావు  నా భక్తుడని
కొందరిలో కూడనీయి కామితఫలమీయి
మహేశా . . . . . శరణు

Sunday, May 28, 2023

శివోహం

శివా!దేహాన్ని చూసి నేనంటున్నాను
దేవాలయానికి వచ్చి నీవంటున్నాను
ఈ నీవు, నేనుల అభేదాన్ని ఎఱుక చేయి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నా ప్రక్కన ఉందువు కానీ...
నాకు  నీవు కనపడవు...
నాకు తెలియకుండ నీవు నాతోనే  పని చేయింతువు
నా ప్రతి పనికి సాక్షీగ ఉంటూ నా పని  పట్టు చుందువని నా కిప్పుడు తెలిసేనూ...
నీవెంత వింత  పనివాడవొ తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Saturday, May 27, 2023

శివోహం

శివా!వెచ్చని కన్నీళ్ళు నీకభిషేకమొనరించి
వెనుదిరిగి నేను వెడలుచున్న వేళ
మధుర శీతల జలము మోము జారె
మహేశా . . . . . శరణు .

శివోహం

పెళ్ళైన కొత్తలో మోహం లేకుంటే
బంధానికి బద్దులవగలమా
పిల్లలపై వ్యామోహం లేకుంటే
విహిత కర్మలు చెయ్యగలమా
అవసరం మేరకే వ్యవహరించాలి
తన నిజతత్వం ఎరగాలి
రొంపిలో పడి కొట్టుకుంటూ
అందులో స్వర్గం వెతుక్కుంటూ
నిస్సహాయమై అలమటి‌ంచేకన్నా 
ప్రకృతి తత్వానికి తలవంచుట మిన్న
కాలానికి తగినట్లు నీ ప్రవృత్తిలో
మార్పు కలుగుటలేదా
సంంకల్పమే నీకుంటే సమయం పట్టినా
నియంత్రణ (self control)సాధ్యపడుటలేదా 
నిన్ను నీవు నియమించగలిగితే 
జీవించినంతవరకు గెలుపు నీదే
ఆనందానికి అంతిమ శ్వాస నీదే

శివోహం

తెలియదు ఇది నీ మాయని...
తెలియదు ఈ లోకమంత నీ మాయా మయమని...
తెలియదు నా అజ్ఞానమే మాయనీ...
తెలియదు నిను మరచుట మాయని...
తెలుపుము ఆ మాయా జ్ఞానము...
తెలుపుము ఆ మాయ తెర  తొలగు విధానము...
మహాదేవా శంభో శరణు.

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...