Monday, June 12, 2023

శివోహం

శంభో...
నిన్ను తలచ మది ఎంతో  పులకరించు
నిన్ను కొలువ జన్మ మింక ధన్య మౌనుగా
శివ నీవే మా ఇల వేల్పువు...
కనికరించి కృప జూడ జాగేల తండ్రి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!తెలిసిన మౌనం తెరతీసింది
మనసైన మౌనం ముందుకొచ్చింది
మాటను గ్రహించు నన్ను అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

శివోహం

నిజం కాని మా బ్రతుకుని నిజమని భ్రమింప జేస్తావు..
ఆ భ్రమ లో ఓపిక ఉన్నంతకాలం తాపత్రయాల మధ్య ఊగిసలాటే ఈ జీవితం...
తీరా కనులు తెరిసాకా గడిచిన కాలం ఓపిక లేని శరీరం మాత్రమే మిగిలేది..

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నీ చూపు పడనిదే బండరాయి వంటి నా హృదయం లో భక్తి అనే మొలక చివురించదు కదా శివ...
ఒక రైతు నీలాకాశం వైపు తన చేల పై చల్లని నీరు కురిపించే నల్లని నీటి మబ్బు కోసం  ఆశగా ఎదురు  చూస్తూ...
తన బ్రతుకు నంతా తాను చూసే  తన కంటి చూపులో  నింపుకుని ఉంటాడో  అలా
నేను నీకోసం పడిగాపులు కాస్తూ నీ అనుగ్రహ వర్షాధార లో మనసారా తనివారా కరువు దీరా  తడవాల ని ఉంది తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Sunday, June 11, 2023

శివోహం

శివా!చావు పుట్టుకలు నీ చేతబట్టుకొని
కర్మ,కామ్యములు మాకు విడిచిపెట్టి
ఆడుకుంటున్నావు నీవు అక్కడా ఇక్కడా
మహేశా . . . . . శరణు .

Saturday, June 10, 2023

శివోహం

ఋణానుబంధాన్ని 
విశ్వసించి గుర్తుంచుకో ! 
నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు ! ఆకలిగొన్నవారికి 
అన్నం, గుడ్డలు 
లేని వారికి గుడ్డలు 
ఇవ్వు ! భగవంతుడు సంప్రీతుడవుతాడు 
 పేదవాన్ని చేరదీసి 
 పట్టెడన్నం పెడితే 
 సాక్షాత్తు పరమేశ్వరుడే 
ప్రసన్న మవుతాడు .
"బంధాలకు విలువ లేని సమాజంలో భగవంతునికి చోటువుందని"మరువకూడదు .
       

శివోహం

ఏ కోరికా లేకుండా భగవంతుడిని ప్రేమించడం,  ఆరాధించడం మనకు అన్ని విధాలా మంచిది. ఈ లోకంలో ఏదైనా విలువైన ఫలాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో దేవుణ్ణి సేవించడం భక్తి అనిపించుకోదు!.  భగవంతుని కంటే విలువైనది మరొకటి లేదు. వేదాలు కూడానూ మన మనస్సులో ఏ కోరికలు లేకుండా భగవంతుడిని ప్రేమించమని సూచిస్తున్నాయి. దేవుని ప్రేమను పొందడానికి దేవుణ్ణి ప్రేమించాలి తప్ప ఇతర అవసరాల కోసం కూడదు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...