Monday, June 26, 2023

శివోహం

శివా!నా మౌనంలో శతకోటి సందేహాలు
నీ మౌనంలో అనంతకోటి సమాధానాలు
మౌనమే మధురమాయె మరెన్నో తెలుసుకొనగ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
ఏమిటి నీ లీల...
అంతా శూన్యంలాగే అనిపిస్తుంది...
ఎక్కడో ఓ మూల భయం, ఆందోళన ఏమీ సాధించలేదు అనే బాధ...
ఓ మంత్రం రాదు, పూజ చేతగాదు గురూపదేశం లేదు, సాధనలేదు ఇక ఈ కట్టె ఇలా కాలిపోవాలసిందే నా...
కలలో కలంలో తప్ప ఇలలో కనిపించవా కపాలధారీ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఈ మానవ శరీరమనే శకటంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆ పనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి.
ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, June 25, 2023

శివోహం

శివా!మరలా మరలా ముగిసేలా
మరణం జననం నాకేల
మరలా సాగుట మరి ఏల
మహేశా . . . . . శరణు .

Saturday, June 24, 2023

నా తండ్రి మణికంఠ

దివ్యమైన
అద్భుతమైన
ఆనందకరమైన
అపురూపమైన
తన సుందర రూపాన్ని
సర్వఅలంకార
అలంకృత
మందహాస మంగళమోహన విగ్రహాన్ని  దర్శింప
జేసి ఎందరి జన్మజన్మలను తరింప జేశాడో నా మణికంఠుడు.
హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

వేగంగా పరుగెత్తే కాలం
మారుతున్న జీవన చిత్రం
ఊపిరి సలుపనిపనుల్లో 
ఎవరికివారు మునకలేస్తున్నారు
పెరుగుతున్న ఆర్థిక బంధాలు
తరిగిపోతున్న హార్దిక బంధాలు
శిథిలమౌతున్న ఆప్యాయతలు
నీరుకారుతున్న సంబంధాలు
ఉరుకుపరుగుల జీవితాలు
బీటలు వారుతున్న అనుబంధాలు
కాల చట్రంలో బందీలు
మరుగున పడుతున్న రక్తబంధాలు
ఎవరికి వారే యమునాతీరే
ఎవరి బాధలు వారివే
పంచుకునే తీరికలేదు
నిన్ను తలచుకునే అవకాశం లేదు
హరి ఏమి ఈ మాయ....
శ్రీహరి శరణు...

ఓం నమో నారాయణ...
ఓం నమో వెంకటేశయా...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

కల్మషమనస్సుల కలిజగత్తులో అంతా పాపభీతే 

ప్రాయశ్చిత్తంకోసం మదిలో నీ నామ స్మరణ...

మహాదేవా శంభో శరణు. 

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...