Monday, July 10, 2023

శివోహం

శివా!నేను నాదను అహము
కాలి బూడిదయిపోయి
నీ దేహాన పూతగ వెలిగిపోనీ
మహేశా . . . . . శరణు .

Sunday, July 9, 2023

శివోహం

భక్తి ఉన్న వాళ్ళందరూ భగవంతుణ్ణి ఆరాధిస్తారు...
కానీ భక్తి తో పాటు శ్రద్ధ కలిగిన వారు భగవంతుడి అనుగ్రహంను పొందుతారు...

ఓం నమః శివాయ.

శివోహం

శంభో!!!
నువ్వు నేను సగం సగం....
నాలో నువ్వు సగం.....
నీలో నేను సగం....
ప్రాణం నాది అయితే.....
అందులో ఊపిరి నువ్వు....
జీవం నాది అయితే.....
అందులో ఉనికి నువ్వు....
హృదయం నాది అయితే.....
అందులో స్పందన నువ్వు....
ఈ దేహం నాది అయితే....
అందులో ఉన్న ఆత్మ నువ్వు.....
జీవాత్మను నేను అయితే.....
పరమాత్మవు నువ్వు....
బాహ్యంగా నేను.....
అంతర్లీనంగా ఉన్నది నీవే కదా హార...
మహాదేవా శంభో శరణు...

శివోహం

అప్పుడప్పుడు నేను నిశ్శబ్దమౌతాను...

నీవేమైన సందేశమిస్తావేమోనని...

శివ నీ దయ.

శివోహం

శివా!శివశివా అంటున్నా
శివ నామం వింటున్నా
శివ సన్నిధి చేరలేక క్షోభిస్తున్నా
మహేశా . . . . . శరణు .

Saturday, July 8, 2023

గోవిందా

మిమ్మల్ని మీరు నిరంతరం సానుకూల స్థితిలో వుంచుకోoడి మరియు మీ మనస్సును దేవుని ఆలోచనలతో నింపండి....
మీరు చీకటి గదిని కాంతివంతం చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా చేస్తారో ఆ విధంగా మీ మనస్సుతో వ్యవహరించండి...
మీరు చీకటితో పోరాడకండి. మీరు చీకటిని వెలుగులోకి తీసుకురండి, అప్పుడు చీకటి తొలగిపోతుంది...

ఓం నమో వెంకటేశయా.

శివోహం

శివ...
నాది అన్నదే లేని జగాన అంతా నాది అనే మురిపాన్ని ఒక్క నీ పిలుపుతో దూరం చేసి  
దరికి చేర్చుకునే కాలుడివే కదా తండ్రి...

కనికరించి పలకరించు కమ్ముకున్న మాయనుండి
తొలగించు నీ దరికి చేర్చు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...