Wednesday, July 12, 2023

శివోహం

బురదలో అంటకుండా నడవడం కష్టమే...
నీటిలో తడవకుండా మునగడం కష్టమే...
కష్టాల కడలిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, పరమాత్మ పై మనసు నిలపడం కూడా కష్టమే...
కానీ శివ నీ దయ అంటు చేతులెత్తి మ్రొక్కడం కష్టమేమీ కాదు కదా మిత్రమా...

శివోహం... సర్వం శివమయం.

Tuesday, July 11, 2023

శివోహం

సహజంగా పుట్టుకతో మనిషిది మంచిస్వభావం గా ఉంటుంది...
కానీ మనిషి పెరిగే కొద్దీ క్రమంగా అతడి స్వభావం పై ప్రభావం చూపే అస్తి, బలగం డబ్బు, కీర్తీ, ఉద్యోగం,దేహ బలంతో ,అతడి కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు పెరుగుతూ మనిషి స్వభావాన్ని మార్చేస్తు దుర్గతి పాలు చేస్తు ఉంటాయి...
మంచి మనిషిగా ఎదగాలంటే అలాంటి పశుతత్వాలు ఈ దివ్య మైనప్రేమ తత్వానికి అడ్డురాకుండ చూడాలి , దైవారాధన స్వభావం తో ఆనందంగా జీవించాలి , ఎదుటివారిని కూడా అదే ఆనంద నిలయంలో  కలుపుకుంటూ వారిలో కూడా  ప్రేమతో అనందాన్ని దర్శిస్తూ భగవద్ సాక్షాత్ కార భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ నా బ్రతుకు లో నీ కరుణ అనే అమృత ధారను కురిపించు...
నిన్ను నిరంతరం తలచి కొలిచే స్ఫూర్తిని శక్తిని అవకాశాన్ని అనుగ్రహించు..
శివ నీ దయ

శివోహం


తజ్జనికి  హరోం హర...
తడమనికి హరోం హర...
కుమరనికి హరోం హర...
మురుగనికి హరోం హర...
శరణు శరణు శరణం మురుగా...
శరణం శ్రీ బాలమురుగా...

శివోహం

శివ...
నా మనోఫలకం నీచితా భస్మంతో...
నా పెదవులు నీనామస్మరణతో....
నా మనసు నీధ్యానంతో...
నా హృదయం నీఆరాధనతో...
నా కరములు నీకు నమస్కారంతో...
నా పాదాలు నీఆలయ ప్రదక్షణలతో...
నా కనులు నీరూప దర్శనంతో...
నా దేహం నీ సేవతో పునీతమయ్యే వరమివ్వు.
మహాదేవా శంభో శరణు.

శివోహం

దేవుడిని నిజంగా నమ్మడమంటే తన అహంకారాన్ని వదులుకోవడమే
ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సాహసం మరొకటి కలదా?...

ఓం నమః శివాయ

Monday, July 10, 2023

శివోహం

నా శిథిల హృదయం శిథిల దేవాలయమే...
అందులో చీకటి సంఘటనలెన్నో చిత్రాలై నన్ను వెక్కిరిస్తున్నాయి.
శివ నీ దయ. 

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...