Friday, July 14, 2023

శివోహం

మోహన కృష్ణ...
నవనీత హృదయా...
నవమోహనాంగా...
నవరస కళా నైపుణ్య చతురా...
శ్రీకృష్ణా పరమాత్మా...
పరంధామా పరాత్పరా...
రుక్మిణీ వల్లభా భక్త సులభా పాహిమాం...
రక్షమాం దేవకీ సుతా...
శరణు చిన్ని కృష్ణా శరణు...
వసుదేవ నందనా...
నంద నందనా శరణు...

Thursday, July 13, 2023

శివోహం

శివ...
నీకు నాకు నడుమ దూరం ఎప్పుడూ 
ఒకేలా ఉంటుంది...
కానీ నా నడక నీవైపు నీవేమో నావైపు నడవడంతో ఆ దూరం అలాగే ఉండిపోతుంది....
అందుకే నిన్ను నా హృదయంలోకి
ఆహ్వానిస్తున్నాను...
క్షణ క్షణం సోహంతో పలకరిస్తాను...
ఇక నీకై నేను రాలేను కానీ నీవే నాకోసం నా గుండెలో గూడు కట్టుకో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఊపిరి వదిలేదాకా నీ నామ స్మరణ వదిలేదే లేదింక...
శివ నీ దయ.

Wednesday, July 12, 2023

శివోహం

భక్తి వల్ల జ్ఞానం వస్తుంది...
మరి నిర్మలమైన భక్తి నీదైతే...
నువ్వు నమ్మే దైవం నిత్యముని చెంతే కదా...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివా!విశ్వమంత ఆకాశం వింతగున్నది
చిత్తంలో ఆకాశం చిత్రమైనది
రెంటిలోన నీ తేజమే వెలుగు చున్నది
మహేశా . . . . . శరణు.

శివోహం

మనిషి అహం మాయమైతే

మనసు దైవత్వం అవుతుంది...

ఓం నమః శివాయ.

శివోహం

నీ కడగంటి కంటి చూపు మా పై పడితే చాలు,
 అదే పదివేలు పరమేశ్వరా...

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...