Tuesday, July 18, 2023

శివోహం

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది
నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో...

లేకపోతే అది నిన్ను శాంతిగా 
ఉండకుండా చేస్తుంది...

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ
శాంతంగా ఉండటం అలవాటు చేసుకో...

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం
ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం...

ఓం నమః శివాయ.

Monday, July 17, 2023

శివోహం

గౌరీమనోహరా...
భక్తజనప్రియా...
ఆనందస్వరూపా...
నాగాభరణా...
నీకు సహస్రాధిక శతకోటి సాష్టాంగ ప్రణామాలు.. దయాసింధూ...
ఆపద్బంధూ...
శరణు మహాదేవా శరణు.

శివోహం

శివ...
నీరూపు తెలీదు...
ఎలా ఉంటావో...
ఎక్కడ నీ నివాసమో...
ఏం చేస్తే నా మొర ఆవేదన నీకు చేరుతుందో అవేమి నాకు తెలియవు...
నీవే గతి అంటూ నీ పాదకమలాలను నా కన్నీటి ధారలతో అభిషేకిస్తున్నాను...
తండ్రీ కాశీ విశ్వేశ్వరా కరుణించు...
నీ అనుగ్రహానికి సరిపడేి యోగ్యతను ప్రసాదించు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!సంసారాన్ని పోల్చగ సాగరం సృష్టించావో
సాగరాన్ని పోలిన సంసారాన్ని కూర్చావో
ఈ రెండూ దాటగ కష్టసాధ్యమాయె.
మహేశా . . . . . శరణు .

అమ్మ

ఓం గోదాయై నమః
ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

అమ్మ

ఓం తులసీవాసజ్ఞాయై నమః
ఓం ఆముక్తమాల్యదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం రంగనాథప్రియాయై నమః

Sunday, July 16, 2023

శివోహం

శివా!నీ ధ్యాసలో నేనిమిడివుంటా ఏనాటికీ
ఏ కారణమునైనా ఏమరపాటునుంటే
ఎరుక చేయవయ్యా ఎదను కదలి
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...