Wednesday, July 19, 2023

శివోహం

శివ...
నీ కరుణ లేనిదే నా మనసు నిగ్రహింపబడదు...
నా జీవిత లక్ష్యం నెరవేరదు...
కావున పరమేశ్వరా నీపై బుద్దిని ప్రసరింప జేసే చిత్తశుద్ధిని...
నిర్మలమైన మనసుని నాకు ప్రసాదించు తండ్రీ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివుని దయయే చాలును...
శివస్మరణమె చాలును...

శివ నీ దయ.

శివోహం

స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్న...
ఎక్కడో ఓ చోట మనసు బంధీగానే ఉంటుంది...

Tuesday, July 18, 2023

శివోహం

శివ...
నేను చేసిన పాపపు ఆలోచనల తెగనరికి
నూతన శిరము ప్రసాదించి నీగణములోకి
చేర్చుకోవా...
తళతళాడే నీ త్రిశూలంతో నాకు త్రికరణశుద్ధి కలిగించవా కరుణామూర్తీ...
శివ నీ దయ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నేను చేసిన పాపపు ఆలోచనల తెగనరికి
నూతన శిరము ప్రసాదించి నీగణములోకి
చేర్చుకోవా...
తళతళాడే నీ త్రిశూలంతో నాకు త్రికరణశుద్ధి కలిగించవా కరుణామూర్తీ...
శివ నీ దయ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

రైతు రాజు కాడు...
దున్నేవాడిది భూమి కాదు.
ఎంత పని చేసిన కష్టం తరగదు, నష్టం తీరదు
అప్పులు, పేదరికం
నిరాశ, నిస్సహాయం
కన్నీళ్ల తడి ఆరదు
కానీ ఆశ చావదు
తాను నమ్ముకున్న మట్టి మోసం చేయదని,
శరీరాన్ని తాకట్టుపెట్టి,
మనసుని బందీ చేసి,
ఆత్మని పొలంలోనే పాతిపెట్టి...
శివ నీ దయ.

శివోహం

శివా!నాతోడు నా రేడు ఎవ్వరో చూడు
ఎన్నలేని రూపాల ఎదిగి వున్నాడు
లోకమైన రూపాన ఒదిగి వున్నాడు.
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...