Saturday, July 22, 2023

హరి

నారాయణా
విశ్వంభర
విశ్వేశా
విశ్వనాథ ప్రభో శరణు
శ్రీకృష్ణా శరణు...
దీన జన బాందవా శరణు...
స్వామీ శరణు.
ఓం నమో నారాయణాయ...

శివోహం

ఇంటిగుట్టు ఆవలి గట్టుకు చేర్చే పరాయోళ్లుంటారు మూసుకుని చూసుకుని మాటాడడం నేర్చుకో.
కనీసం శబ్దం లేని భాష నేర్చుకో

ఓం నమః శివాయ.

Friday, July 21, 2023

హరి

హరి...
నా అవసరానికి మాత్రమే తలుచుకునే స్వార్ధ పూరిత వ్యర్థ జీవిని నేను...
నిన్ను స్మరిస్తేనే కదా నేను నిజమైన మనిషిని... తలపులో, వలపులో, నెలవులో నిన్ను భావించక పోతే రెండు కాళ్లున్న పశువునే కదా శ్రీహరి...
నీకు దూరమై మానవత్వ విలువలు కోల్పోతున్న నా సంస్కారం, నా విజ్ఞానం, ఇక నీ కోసం, దైవారాధన కోసం తపించి తరించ గలదా తండ్రి...

గోవిందా శరణు...
ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమః.
ఓం నమో వెంకటేశయా నమః.
ఓం గోవిందయా నమః
ఓం నమో లక్మినరసింహాయ నమః.
జై శ్రీరామ్ జై జై హనుమాన్
జై శ్రీమన్నారాయణ.

శివోహం

నీవు సృష్టించిన ఈ అందాల ప్రకృతిలో నిన్ను దర్శించి తన్మయత్వం పొందే సౌలభ్యం ఉంది...

చూడగలిగే కళ్ళు ఉండాలి గానీ సృష్టిలో ,అణువణువునా, అడుగడుగునా నీవే తండ్రి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అంతటా అన్నిటా అరూపి గాను
గుడిలోని మాకొరకు అరూపరూపి గాను
అమరి వున్నావయ్య మహాద్భుతంగాను
మహేశా . . . . . శరణు .

Thursday, July 20, 2023

శివోహం

मैं और मेरे भोलेनाथ दोनों ही भुलक्कड़ है,
वो मेरी गलतियाँ भूल जाते है और मैं उनकी मेहरबानियाँ

శివోహం

శివా!చిన్న జాబిలి తెచ్చి సిగను పెట్టేవు
పెద్ద పామును పట్టి మెడను చుట్టేవు
ఎద్దునెక్కిన నీవు నన్నేమి చేసేవు
మహేశా . . . . . శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...