Wednesday, July 26, 2023

శివోహం

ఈ విశ్వానికి సృష్టికర్త ఆ భగవంతుడు. సృష్టి మొత్తం ఆ భగవంతుడిదే. అన్నీ ఆయనవే. ఆయనవి కానివి ఈ లోకంలో ఏమీలేవు. చివరికి మనం కూడా ఈ సృష్టిలోని భాగమే. అందుకే యమునాచార్యులు తమ స్తోత్ర రత్నంలో ఇలా పేర్కొన్నారు. ‘స్వామీ! ఇన్నాళ్లూ ఇదినాది అని అనుకున్నదేదీ నాదికాదని తెలిసిపోయింది. చివరకు నేను అనుకునే నేను కూడా నీకు చెందిన మనిషినే. అన్నీ నీవేనని తెలిసింది. నాదంటూ ఏదీ లేనప్పుడు... అసలు నేనే నాకు కానప్పుడు నీకు నేను ఏమివ్వగలను?’ ఇలా శరణాగతి లక్షణంతో భక్తితత్వాన్ని ప్రకటించిన మనిషి నిరహంకారుడై ఉంటాడు. అప్పుడే నేను గొప్ప, నేను తక్కువ అనే భేదభావం ఆ మనిషిలో ఉండదు. అతడు మానవసేవ చేస్తూ సకల ప్రాణుల్లోనూ సర్వేశ్వరుణ్ని చూస్తాడు.

శివోహం

అణువు అణువున వెలసిన నీవు మాకు అగుపించేది ప్రకృతిలో...
ఆ ప్రకృతి పరవశములోనే మాకు వినిపించేది నీ ప్రణవనాదమే...
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది...
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహాదేవా శంభో శరణు.

Tuesday, July 25, 2023

శివోహం

ఈ విశ్వానికి సృష్టికర్త ఆ భగవంతుడు. సృష్టి మొత్తం ఆ భగవంతుడిదే. అన్నీ ఆయనవే. ఆయనవి కానివి ఈ లోకంలో ఏమీలేవు. చివరికి మనం కూడా ఈ సృష్టిలోని భాగమే. అందుకే యమునాచార్యులు తమ స్తోత్ర రత్నంలో ఇలా పేర్కొన్నారు. ‘స్వామీ! ఇన్నాళ్లూ ఇదినాది అని అనుకున్నదేదీ నాదికాదని తెలిసిపోయింది. చివరకు నేను అనుకునే నేను కూడా నీకు చెందిన మనిషినే. అన్నీ నీవేనని తెలిసింది. నాదంటూ ఏదీ లేనప్పుడు... అసలు నేనే నాకు కానప్పుడు నీకు నేను ఏమివ్వగలను?’ ఇలా శరణాగతి లక్షణంతో భక్తితత్వాన్ని ప్రకటించిన మనిషి నిరహంకారుడై ఉంటాడు. అప్పుడే నేను గొప్ప, నేను తక్కువ అనే భేదభావం ఆ మనిషిలో ఉండదు. అతడు మానవసేవ చేస్తూ సకల ప్రాణుల్లోనూ సర్వేశ్వరుణ్ని చూస్తాడు.

శివోహం

ఏ నామాన్ని తలస్తే మనస్సు పులకరిస్తుందో అదే రామనామం.
తారకమంత్రం...
శక్తివంతం...
శ్రీరామా...

Monday, July 24, 2023

శివోహం

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం...
ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు...
అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు.  దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు....
ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు. 
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మనసులు నిజాన్ని మార్చలేరు...
కానీ...
నిజం మనిషిని మార్చగలదు , 
నేనె సాక్షి...
ఓం నమః శివాయ

శివోహం

అమ్మ నీకు వందనం...
జన్మనిచ్చావు...
అందులో ఉత్తమ మానవజన్మను ప్రసాదించావు... సంస్కారం సంప్రదాయం ఉన్న చక్కని కుటుంబంలో. బంధువు బలగం ఆస్తి ఐశ్వర్యం ,ప్రేమానురాగాలు గల కన్నవారు సత్సంతానంతో అనుగ్రహించావు...
అమ్మ ఎన్ని ఉన్నా ఎంత మంది ఉన్నా...
నీ ఒడిలో ఉన్నంత ఆనందము హాయి సంతృప్తి ఎక్కడా దొరకవు...
అమ్మ ఈ జనన మరణ చక్ర వలయం లో తిరగలేను మళ్ళీ మళ్ళీ ఏ తల్లి గర్భంలోకి పంపిచక...
నన్ను నీ గుండె గూటిలో దాచుకో తల్లి...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా.

ఓం శ్రీ మాత్రే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...