Saturday, August 5, 2023

శివోహం

నీకోసం ...

ఎదురుచూస్తూ ఎరుపెక్కిన 
నా కనుల అరుణవర్ణాన్ని ...
మించి ఉంటుందేమో నీ త్రినేత్ర నేత్రం ?
అందుకే అది నీ నుదుటిపై అక్కడుందేమో ??

నీ నామనాదంతో నినదిస్తూ 
నర్తించే నా ఒంటి నాలుకను ...
మించి ఉంటుందేమో 
నీ రెండునాలుకల నాగసర్పం?
అందుకే అది నిను పెనువేసిందేమో??

నీ రుద్రంతో రోమాంచితమయ్యే 
వేనవేల రోమశూలాల శరీరాన్ని ...
మించి ఉంటుందేమో నీ చేతి త్రిశూలశూలం?
అందుకే అది నిను చేరవచ్చిందేమో ??

తనువులోని అణువణువు
ఆత్మలింగమై అర్చించే ఆర్తిని ...
మించి ఉంటుందేమో 
నీ డమరుకనాద విన్యాసం?
అందుకే అది నీకు ఆలంబనమేమో??

నేను కూడా నీ ఆవేశాన్నే 
ఆయువు ఉన్న ఆయుధాన్నే ...
అక్కున చేర్చుకుంటావో ?
ఆలింగనం చేసుకుంటావో ??
" నీ అభీష్టం తండ్రీ " 

శివోహం  శివోహం

శివోహం

శివా!దక్షిణామూర్తిగా వుంటే ఏమో గానీ
దాక్షిణ్యమూర్తిగా వున్నప్పుడు కూడా
ఉలుకు పలుకు లేకుంటే ఎలాగయ్యా
మహేశా . . . . . శరణు .

Friday, August 4, 2023

శివోహం

పరమాత్మ చింతనయే ద్యేయంగా పరమావధిగా పెట్టుకొంటూ...
మనసును బుద్ధిని  దైవానికి అంకితం చేద్దాం...

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ క్రిష్ణ హారెహరే...
హారేరామ హారేరామ రామరామ హారెహరే...
ఓం నమః శివాయ.
జై శ్రీమన్నారాయణ.

సర్వే జనాః సుఖినోభవంతు

శివోహం

మాతృదేవో భవ...
పితృ దేవోభవ...

శివోహం

శివా!చూస్తున్నాను , చూస్తున్నాను
నీ దర్శనానికై ఎదురు చూస్తున్నాను
ఎదను చూడగ నిన్ను ఎదురీదుతున్నాను
మహేశా . . . . . శరణు .

Thursday, August 3, 2023

శివోహం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం

శివోహం

మనిషి జీవితం దుఃఖమయం
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.

ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు
బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని  దుఃఖిస్తాడు.

బయటకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంటే పూర్వ జ్ఞానం పోయిందే అని  దుఃఖిస్తాడు.

తల్లి పాల కోసం ఆకలితో  దుఃఖిస్తాడు
శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా  ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.

బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు
నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.

యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.

ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.

ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది  అంతేకాని ఆత్మ హత్య చేసుకోరాదు.

పెళ్లి చేస్తే స్వేచ్ఛ పోయినదనిదుఃఖిస్తాడు.

భార్య బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.

పక్క వాళ్ళ కంటే మనం తక్కువగా ఉమ్నమని దుఃఖిస్తాడు.
వ్రిద్ధాప్యం వచ్చాక నవారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.

ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్లకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...