Tuesday, August 8, 2023

శివోహం

కోతి వంటి మనసు  ఊరకే ఉండదు
 కుక్క వంటి యెఱుక  కూర్చుండనివ్వదు
 జిగురు వంటి వాసన వదలదు
చెత్త వంటి చిత్త  చింత వీడదు
 పశువు వంటి బుద్ధి మారదు
 కారం వంటి అహంకారం పోదు
 గింజ వంటి కర్మబాసిపోదు
 తొత్తు వంటి మాయ తొలగదు.
ఆకలి వంటి తాపంబు ఆగదు.
 విత్తు వంటి అజ్ఞానం మాసిపోదు
 కట్టే వంటి కర్మ కాలిపోదు
అప్పువంటి ఋణానుబంధం తీరదు.
శివ నీ దయ.

Monday, August 7, 2023

శివోహం

తండ్రి నీ ఆటలో ఆడీ ఆడీ అలసిపోయిన దాసుడను నేను...
ఈ దాసుని ఆలనాపాలనా యజమానిగా నీదే భాధ్యత...
మీ పాదములను ఆశ్రయించిన ఈ దాసుని జీవితము రాబోవు ఆ అద్భుతము కోసం వేచి ఉన్నది తండ్రి... 

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా ! నీ దివ్య ప్రేమకు మంత్ర ముగ్ధులము 
పారవశ్యమున నా మానసమున 
మునుగు మేము నీ చైతన్య జలధిని 
శివా ! నీ దయ

Sunday, August 6, 2023

శివోహం

చిత్తం చపలం దాని ధోరణి చిత్రానుచిత్రం...
ఒకోసారి నిరాశధోరణి...
మరోసారి ఆశావహ దృక్పధం...
ఎప్పుడు దేనిని పట్టుకుంటుందో, దేనిని విడిచిపెడుతుందో కానీ, అందలం ఎక్కిస్తుంది,
దాని నియంత్రణలో ఉన్నంతకాలం అదఃపాతాళంలోనికి పడేస్తుంది...
స్వర్గ నరకాలను చూపిస్తుంది 

విస్మయమేమిటంటే, తప్పొప్పులను సమీక్షించుకోకుండా మనస్సుకు తోచిందే సరైనదని సమర్ధించుకుంటూ, అనాలోచిత అభిప్రాయాలను స్థిరపరుచుకుంటూ, సమస్యలను బూతద్దంలో చూసి దుఃఖపడడం!

సమర్ధించుకోవడం కంటే సరిదిద్దుకుంటే చాలావరకు దుఃఖం మటుమాయం.

ఓం నమః శివాయ.

శివోహం

శివ...
నన్ను బ్రోచే భారం నీదే...
బరువూ నీదే ప్రభూ...
త్రికరణ శుద్దితో నేను నీకు సమర్పించే అంతఃకరణాన్ని అనుగ్రహించు...
కృతజ్ఞతతో అర్పించే నా నిర్మల హృదయాన్ని నీ కొలువుగా మార్చి నన్ను నీ భావనలో  నీ సేవలో భావించి నన్ను  కృతార్థున్ని చెయ్యి తండ్రీ....
నిన్ను నమ్మిన నా నమ్మకాన్ని వమ్ము చేయకు.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నన్ను బ్రోచే భారం నీదే...
బరువూ నీదే ప్రభూ...
త్రికరణ శుద్దితో నేను నీకు సమర్పించే అంతఃకరణాన్ని అనుగ్రహించు...
కృతజ్ఞతతో అర్పించే నా నిర్మల హృదయాన్ని నీ కొలువుగా మార్చి నన్ను నీ భావనలో  నీ సేవలో భావించి నన్ను  కృతార్థున్ని చెయ్యి తండ్రీ....
నిన్ను నమ్మిన నా నమ్మకాన్ని వమ్ము చేయకు.
మహాదేవా శంభో శరణు.

Saturday, August 5, 2023

శివోహం

శివలింగ ఆరాధన...
సృష్టిలోని స్త్రీ, పురుష లింగ జాతుల సమ్మేళనం...
భిన్నత్వంలో ఏకత్వం ద్వైతం లో అద్వైతం...
నీవు, నేను వేరు కాదు...
నేనే నీవు ,నీవే నేను...
ఓం శివోహం...సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...