కోతి వంటి మనసు ఊరకే ఉండదు
కుక్క వంటి యెఱుక కూర్చుండనివ్వదు
జిగురు వంటి వాసన వదలదు
చెత్త వంటి చిత్త చింత వీడదు
పశువు వంటి బుద్ధి మారదు
కారం వంటి అహంకారం పోదు
గింజ వంటి కర్మబాసిపోదు
తొత్తు వంటి మాయ తొలగదు.
ఆకలి వంటి తాపంబు ఆగదు.
విత్తు వంటి అజ్ఞానం మాసిపోదు
కట్టే వంటి కర్మ కాలిపోదు
అప్పువంటి ఋణానుబంధం తీరదు.
No comments:
Post a Comment