నీవు కనపడ నంత వరకే
ఏవేవో కోరికలు
నీవు తీర్చాలని
వేడుకోవాలనిపిస్తుంది
ఏవేవో ఆశలు
నీవు నెరవేర్చలని
విన్నవించుకోవాలనిపిస్తుంది
ఏవేవో సంబారాలు
నీవు ఇవ్వాలని
ప్రార్ధించాలని అనిపిస్తుంది
ఏవేవో సుఖ సంతోషాలు
ఆనందాలు నిన్ను
అడగాలనిపిస్తుంది
నీ ఎదుట నిలిచాక
కన్నీటి పొరలు తొలగి
నిను చుస్తే చాలనిపిస్తుంది
నువ్వు అక్కున చేరిస్తే
గొప్ప వరము అనిపిస్తుంది
నీ వాత్సల్యం పొందటం
మహా భాగ్యం అనిపిస్తుంది
శివయ్యా నీవే దిక్కయ్యా
No comments:
Post a Comment