Monday, August 21, 2023

శివోహం

నీ యదలో భారం కరిగే వరకు స్మరిస్తూనే ఉండు శివ నామ స్మరణ...

ఓం నమః శివాయ.

శివోహం

నీ యదలో భారం కరిగే వరకు స్మరిస్తూనే ఉండు శివ నామ స్మరణ...

ఓం నమః శివాయ.

శివోహం

ఉన్నదీ ఉండేదీ నీవొక్కడివే...
మేము వస్తుంటాం పోతుంటాం...
నిలకడలేని జీవాలం నీ ఆధీనులం...
ఎరుకతో కూడిన నిద్రలో నీవు మాకు
స్వప్నంగా కనిపిస్తావు.....
కన్ను తెరిచి చూస్తే మాయమైపోతావు...
నీపాదాలట్టుకొని నిన్ను అంటిపెట్టుకుంటే తప్ప అంతా మాయే.

మహాదేవా శంభో శరణు

శివోహం

శివా!చీకటిలో నేను, చీకటికావల నీవు
ఈ వల దాటి , ఆవలి చేరగ నేను
ఏ వల తాకగ లేని కావలి కావా నాకు
మహేశా . . . . . శరణు

Sunday, August 20, 2023

శివోహం

శివ...
తిరగలి పిడి అనే నా జీవన నాడి...
నీ చేతిలో ఉంచి నీవే నన్ను
"నేను" నలిగే వరకూ...
నీవే తిప్పాలి త్రినేత్ర దారి పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నీతో ఏదో చెప్పాలని అనిపిస్తోంది
నాకేదో తెలుసుకోవాలని అనిపిస్తోంది
చెప్పలేక పోతున్నా, సతమతమవుతున్నా.
మహేశా .  . . . . శరణు .

శివోహం

నీవోసగం నేనోసగం
ఒక్కటైతేనే అది అర్థనారీశ్వరతత్త్వం
శివడు శక్తి కలిస్తేనే శివశక్తి
పుట్టింటిపై అభిమానంతో వెళ్ళిన సతికి
అవమానం ఎదురైనప్పుడు
వెక్కిరించలేదు ఆ పరమేశ్వరుడు
ఆమె అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు
భక్తుల కష్టాలకు విచరితుడై
హాలాహలాన్ని మింగినపుడు
భర్తకంఠాన్ని నొక్కిపట్టి
విషాన్ని అక్కడేఆపేసింది కాత్యాయని
భార్యాభర్తలు చూచుటకు ఇద్దరు
వారి మనసులు మమేకం
భర్త తొందరపడితే భార్య ఆపాలి
భార్య తప్పుచేస్తే భర్తసరిదిద్ధాలి
ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండటమే
అర్థనారీశ్వరతత్త్వం
ఒకరి ఆలోచనలు ఒకరు
ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకుంటూ
జీవితకాలం కలిసిఉండటమే
అర్థనారీశ్వరతత్త్వం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...