నీవోసగం నేనోసగం
ఒక్కటైతేనే అది అర్థనారీశ్వరతత్త్వం
శివడు శక్తి కలిస్తేనే శివశక్తి
పుట్టింటిపై అభిమానంతో వెళ్ళిన సతికి
అవమానం ఎదురైనప్పుడు
వెక్కిరించలేదు ఆ పరమేశ్వరుడు
ఆమె అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు
భక్తుల కష్టాలకు విచరితుడై
హాలాహలాన్ని మింగినపుడు
భర్తకంఠాన్ని నొక్కిపట్టి
విషాన్ని అక్కడేఆపేసింది కాత్యాయని
భార్యాభర్తలు చూచుటకు ఇద్దరు
వారి మనసులు మమేకం
భర్త తొందరపడితే భార్య ఆపాలి
భార్య తప్పుచేస్తే భర్తసరిదిద్ధాలి
ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండటమే
అర్థనారీశ్వరతత్త్వం
ఒకరి ఆలోచనలు ఒకరు
ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకుంటూ
జీవితకాలం కలిసిఉండటమే
No comments:
Post a Comment