Thursday, August 24, 2023

అమ్మ దయ

బిడ్డ ఏదైతే చెప్పలేదో మనసులో ఉన్న మాటను ఒక్కరు మాత్రమే అర్థం చేసుకోగలరు తానే అమ్మ.
అందుకే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే                                    ఓం శ్రీమాత్రే నమః

Wednesday, August 23, 2023

శివోహం

ఎంత పెద్ద పదవులు సంపాదించినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా చివరకు నశ్వరమైన ఈ శరీరాన్ని విడిచి వెళ్ళవలసిందే.......

నువ్వు అనేది ఈ భౌతిక శరీరం కాదు.... జనన మరణాలకి అతీతమైన నీ అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడమే ఈ జీవిత పరమార్థం.....

ఓం నమః శివాయ.

శివోహం

శివా!ఏ సిరులైన యిచ్చు వాడవని తెలిసి
జ్ఞాన వైరాగ్య సిరులీయ వేడుకుంటి
ఆ సిరులు అందించు అజ్ఞానమును తృంచు
మహేశా . . . . . శరణు .

శివోహం

మారని మా తలరాత
మార్చుట నీ ఘనత  

శివ నీ దయ.

శివోహం

శివ...
నీలో లీనమై పోవాలని మనసు అరటపుడుతుంది..
నా మనసేరిగిన మహాదేవుడివి నీవు...
శివ నీ దయ.

Tuesday, August 22, 2023

స్వామి అయ్యప్ప

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది
నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో !!

లేకపోతే అది నిన్ను శాంతిగా 
ఉండకుండా చేస్తుంది !!

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ
శాంతంగా ఉండటం అలవాటు చేసుకో !!

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం
ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం !!

ఓం నమః శివాయ.

అమ్మ మాయమ్మ దుర్గమ్మ

జగన్మాత...
విశ్వపాలిని...
సర్వమంగళ...
దరిత్రిని పావనం చేయడానికి నీ ఈ రూపాల వెలుగులను అనుగ్రహించి మమ్ములను ధన్యులు చేశావు...
తల్లీ నీ కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతిగా ఏమివ్వగలం తల్లి...
కృతజ్ఞతలు...
సద్బుద్ధి..
దైవభక్తి...
అచంచల విశ్వాసం...
ప్రేమానురాగాలు...
మాలో నిత్యం ఉండేలా అనుగ్రహించు...
అమ్మా లోకమాత దుర్గాభవాని నీకు మా శతకోటి ప్రణామాలు సమర్పించు కుంటున్నాం...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా...
అమ్మ దుర్గమ్మ శరణు.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.