Tuesday, September 5, 2023

శివోహం

శివా!కంటి నీరు ఆరిపోనీ
కర్మఫలం చెల్లిపోనీ
నేను నేనుగా మిగిలిపోనీ
మహేశా . . . . . శరణు .

Monday, September 4, 2023

శివోహం

ఈ లోకంలో రెండు సత్యాలుండవు...

సత్యం ఒకటే ఏక సత్యం...

ఒక రాజ్యానికి ఇద్దరు రాజులుండరు ఒకడే ఉంటాడు...

ఖగోళంలో ఇద్దరు సూర్యుళ్లు ఇద్దరు
చంద్రుళ్ళుండరు ఒకరే ఉంటారు అనేది ఎంత సత్యమో
శివుడు ఒక్కడే అనేది అక్షర సత్యం...

ఓం శివోహం... సర్వం శివమయం
ఓం పరమాత్మనే నమః.

శివోహం

శివ ! గుక్కెడు నీళ్ళు పోసినందుకా ? దోసెడు కన్నీలిచ్చావు
చిటికెడు విభూతి వేసినందుకా శ్రీ కరి సిరిని నా ఇంట ఉంచావు
నుదిట గంధం రాసినందుకా ? విధ్యా గంధం పూయించావు
తిలకం అలది నందుకా ? శృతి స్మృతి పురాణాలు అలది ఇచ్చావు
కర్పూరం చూపినందుకా ? జ్ఞాన జ్యోతి వెలుగును చూపావు
నీ కోసం జన్మ జన్మల కన్నీళ్లు సమర్పయామి శివా ! నీ దయ

శివోహం

శివా!ఒడిసి పట్టుట ఎటులో తెలిసేట్టు
ఒకమాట నాతో చెప్పిపెట్టు
మనసు పై నాకు ఆ పట్టు దక్కేట్టు.
మహేశా . . . . . శరణు .

Sunday, September 3, 2023

శివోహం

భక్తి అనేది  తెచ్చి పెట్టుకునే వస్తువేం  కాదు
అది జన్మతహా  ఆత్మలో నిక్షిప్తమై నీవు ఎదిగే
కొలది అదీ ఎదిగి వృక్షమై నిను రక్షించి  సేద
తీర్చి హరి సాయుజ్యమౌవ్వాలి...

ఒకరి  భక్తిని  హేళన  చేసినా వాని  మనసును  
నొప్పించినా వాని ఆత్మలో కూడా నీ ఆరాధ్య   
దైవమే నివసించునని  యెరుగు...

నా మాట వినక నీ ధోరణే  నీదైతే ముక్తి కై పోరాడు  నీ శ్రమను  పరమాత్మ  స్వీకరించడు...
అధోగతి  పాలగుదువు...
తెలుసుకుని మసలి   మనుగడ  సాగించవే  
మతిలేని  నా  మనసా....

ఓం నమః శివాయ

శివోహం

శివా!నీవే ఊపిరై ఊరేగుతున్నాను
ఊ‌రేగి నీ భక్తి అలవరచుకున్నాను
ఆ భక్తి ఊపిరిని ఊదేసి నిను చేరనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

క్షణక్షణం ఎగిరెగిరి పడుతూ మారుతూ ఉంటుంది నా మనసు...
సకల మాయాలు మొసాలు చేసేది ఇదే మాయదారి మనసు...
దీని రాకడపోకడ ఏరిగేది నీవే మహాదేవా...
నా పాపాపుణ్యాలకు నీదే పూచి...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...