Saturday, September 9, 2023

శివోహం

శివా!గుండె గుండెను చేరి గూడు కట్టేవు
బండరాళ్ళను చేరి భాసించేవు
అన్నింట నీవున్న అందకున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

కాలగమనంలో కదిలే క్షణాలలో ఊపిరి ఊయలో శివ పార్వతుల ధ్యానం చేయుచుండగా వినిపించే గుండె చప్పుడు ఓంకారమై విశాల లోకాలు ఆవరించి మహాదేవుడు నా మదిలోకి ఉరుకుల పరుగుల నాట్య మాడుచూ నా మనసు ముంగిట
నటరాజుగా నిలిచినాడు...
శివ నీ దయ....

ఓం పరమాత్మనే నమః.

Friday, September 8, 2023

శివోహం

మర్కట బుద్ది కలిగిన నా మనసు...
కోర్కల వలయంలో  చిక్కి...
కర్కశ హృదయంగా  మారి...
కొరరానివి కోరుతూ ఉన్నది...
కనికరం తో కోర్కెలతో పాటు నన్ను కడతేర్చి కరుణించు...

మహాదేవా శంభో శరణు... 

శివోహం

శివా!కాలాన్ని కంఠానపట్టి కాళాన్ని కంఠాన చుట్టి
కాలాన్ని శూలముగ కరమున చేపట్టి
శోభించు చున్నావు కాలము ఖేలనమాయె నీకు
మహేశా . . . . . శరణు .

Thursday, September 7, 2023

శివోహం

అన్ని బంధాలు తెంచుకొని, దేహంతో సహా అందరిని వదలి నిన్ను చేరుటకు ఏ క్షణమైనా నే సిద్ధమే ఎపుడైనా తప్పని దానికి వృద్ధాప్యం వరకు ఎదురు చూడడం ఎందుకు శివ.

శివోహం

శివ.. 
జీవితమంతా ఆటపాటలతోను, కామవాంఛలతోను, చింతలతోను గడిపి, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్న అది గాక సచ్చిదానంద స్వరూపమైన పరమాత్ముడివి నీవు కనీసం నీ వైపుకు అడుగు వేయకుండా ఈ మానవజీవితాన్ని వ్యర్థం చేసుకున్న...
జీవితమంతా ఇలా గడచిపోతుంటే నిన్ను చేరేది ఎప్పుడు...
మహాదేవా శంభో శరణు.

ఓం పరమాత్మనే నమః.

శివోహం

శివా!నీ సృష్టిలో లేని దోషాలు
నా దృష్టిలో ఎందుకు పెట్టావు
వేలవేలుగ ఎందుకు విస్తరింపజేసావు
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...