Wednesday, September 13, 2023

శివోహం

భగవంతుడు చైతన్యపు లోతుల్లో మౌనంగా ఉంటాడు. భక్తుడు కూడా అదే స్థితిలో ఉంటేనే భక్తుడు ఆయనతో కలసి ఆత్మానందుడవుతాడు. దీనినే భగవదనుగ్రహం అంటారు.
మౌనంలోనే యదార్థం ఇవ్వడం, పుచ్చుకొనడం జరుగుతుంది
-మెహెర్‌ బాబా

Tuesday, September 12, 2023

శివోహం

మట్టితో బొమ్మను చేసి...
మనిషిగా ప్రాణకు పోసి...
బంధానికి బంది చేసి...
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి....
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా...
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివ ఇక ముగింపు పలుకు
నాకు లేకుండా ఇంక ఏ పలుకు...

శివ నీ దయ..

Sunday, September 10, 2023

శివోహం

నీ సేవా భాగ్యము ను పొందిన ఈ మూగ ప్రాణుల ముందు...
ఉన్నతమైన నా మానవ జన్మ చిన్నబోతొంది తండ్రీ..
మహాదేవా శంభో శరణు.

ఓం పరమాత్మనే నమః.

శివోహం

శివుణ్ణి కొలిచేవారికి సంపదలపై మోజుకన్నా శివుణ్ణి చూసి తరించాలనే కోరిక ఎక్కువ ఎందుకంటే నిత్య సంపదలకన్నా శాశ్వత సంపద మహాదేవుడే...
ఓం నమః శివాయ.

Saturday, September 9, 2023

శివోహం

శివా!గుండె గుండెను చేరి గూడు కట్టేవు
బండరాళ్ళను చేరి భాసించేవు
అన్నింట నీవున్న అందకున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

కాలగమనంలో కదిలే క్షణాలలో ఊపిరి ఊయలో శివ పార్వతుల ధ్యానం చేయుచుండగా వినిపించే గుండె చప్పుడు ఓంకారమై విశాల లోకాలు ఆవరించి మహాదేవుడు నా మదిలోకి ఉరుకుల పరుగుల నాట్య మాడుచూ నా మనసు ముంగిట
నటరాజుగా నిలిచినాడు...
శివ నీ దయ....

ఓం పరమాత్మనే నమః.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...