Monday, September 18, 2023

శివోహం

నీ ప్రార్ధనను సరిగ్గా పలకలేక పోయిన అందు ఉచ్చారణ దోషం ఉన్న పరమేశ్వరుడు నీ హృదయ స్పందన వింటాడు మిత్రమా...
మరి స్మరిస్తూనే ఉండు కదా సదా శివ నామ స్మరణ.

శివోహం

నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి...
అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు...
ఈ దేహం నాది కాదు...
ఈ ఊపిరి నాది కాదు...
ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు...
అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి...
ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు...
నీ విధులు నువ్వు సాగించు...
నీకు కావలసినంత ప్రశాంతతా లభిస్తుంది...

ఓం శివోహం సర్వం శివమయం.

Sunday, September 17, 2023

శివోహం

కోరితే కోరినంతే ఇస్తాడు ఏక దంత గణపతి...

కోరకుంటే చేతి నిండా ఇస్తాడు మహాగణపతి...

ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

Saturday, September 16, 2023

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది పరమేశ్వరా...
నీవే నాకు కొండంత అండగా ఉండి...
నన్ను కాపాడగారావా...
మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా!ఎనుబోతు పయనంబు ఎన్నాళ్ళు
నా కామ్యాశ్వము నీకు అర్పిస్తా
విశ్వమంత హాయిగా విహరించవయ్యా
మహేశా . . . . . శరణు .

Friday, September 15, 2023

శివోహం

శివా!బంధాలు అన్ని దేహానికి
ఆనందాలన్నీ ఆత్మకి అయితే
ఆత్మానంద అనూభూతి అందనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ అను రెండక్షరములే మహా మంత్రము...
శివ పాదారవిందమే అనన్య శరణ్యమని నమ్మి సదా ఉపాసించుచున్న దాని కంటే వేరొక భాగ్యవంతుడులేడు.
అతడే ధన్యుడు, కృతార్ధుడు.

ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం పరమాత్మనే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...