Wednesday, September 20, 2023

శివోహం

సతమతం అవుతున్న జీవితానికి నిర్ణయమే బలం...
మనసు పెట్టి ఆలోచించు మిత్రమా ఎన్నో మార్గాలు కనిపిస్తాయి...

ఓం నమః శివాయ.

శివోహం

కోల్పోయినవి ఎలాగో పొందలేము...

కానీ

పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి...

నిజమే కదా మిత్రమా.

Tuesday, September 19, 2023

శివోహం

నిన్నే మా దేవుడని అనుకున్నాము 
మంచు మనసునీదని మా విన్నపాలు విన్నవించుకుంటున్నాము 

నీవొక నమ్మకమే కావచ్చు
నీకొక రూపం లేకపోవచ్చు
కాని శంకరుడంటే మంచివాడంటారు
కరిగిపోయే మనసు కలవాడంటారు
కోపమేమాత్రం వలదయ్య మాపై చూపు నీ దయ

నమ్మకం లేక కాదు కాని నరుడనయ్యాను
సందేహం కాదు కాని సామాన్యుడనయ్యాను
మన్నించి మా విన్నపాలు పంచుకో
మా మనసును ఓ జ్యోతివై మా హృదయాన్నే నీ ఆలయముగా చేసుకో

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!కనులు మూసి చూచిన కారు చీకటి
కనులు తెరచి చూసిన చిమ్మ చీకటి
చీకటి పోయేలా చిచ్చు కన్ను తెరిపించు.
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎదలో ఉంటే మనో నేత్రాలకి దర్శనం...  

ఎదురుగా ఉంటే మాంస నేత్రాలకి  దర్శనం...  

ఆత్మా  దేహం ఏకమయేలా నన్ను  నీ దర్శనం  చేయనీ...

మహాదేవా శంభో శరణు.
ఓం పరమాత్మనే నమః.

Monday, September 18, 2023

శివోహం

శివా!నీవు నా స్మరణలోనే వుంటూ
నాకు స్పురణగా రాకుంటే మరి
ఈ నా పలుకులెలా విరిసేను
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!శోధనకు సాధన తోడు
సాధనకు సహనం తోడు
సహనానికి నీవే తోడు.
మహేశా . . . . . శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...