Friday, September 22, 2023

శివోహం

శివా!నింగి నేల నిన్ను తాకక నిలువ లేవు
నింద యన్నది నిను చేరి నిలువలేదు
నీ స్మరణలేని క్షణం ఈ బ్రతుకు లేదు
మహేశా . . . . . శరణు .

Thursday, September 21, 2023

శివోహం

ఎప్పటి నుంచో తెలియదు కానీ...
ఈ హృదయంలో 'ఆశ' అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది....
కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి....
ఇంట్లోకి ఎలుక ప్రవేశించి నూతన వస్త్రాలను కొరికి పాడుచేసినట్లు, ఇది నా మంచి ప్రయత్నాలను, సత్ర్పవర్తనలను పాడు చేస్తోంది.
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నీ పరివారంలో ప్రవేశించనీ
పాము పక్షి పశువు ఏదైన నేమి
ఈ పశువు ప్రార్థన పరిగణించు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో వారితో నువ్వు అలానే ప్రవర్తించు..
*అదే ధర్మం..*
శివోహం

శివోహం

వయసుకు మించి అనుభవం ఉన్న...
గుండెను చీల్చే సందర్భాలను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది..
బయపడకు మిత్రమా మహాదేవుడు ఉన్నాడు...       

                       *శివోహం*

శివోహం

మంగళ గౌరీ తనయా గణేశా
మమ్ములను కాపాడే మహానీయుడవు
నిను చేరి పూజింప నేవచ్చినాను
అడ్డంకులను తొలగించి నీ చెంత చేర
నాకు నీవే శరణు కాణిపాకు వినాయకా!
పార్వతి పుత్ర శరణు
స్వామి గణేశ దేవణు
సిద్ధి వినాయక శరణు
విఘ్న వినాయక శరణు
ఈశ్వర పుత్ర శరణు

ఓం గం గణపతియే నమః.

Wednesday, September 20, 2023

శివోహం

శంభో!!!
బతుకు పోరులో నేను దారి(ధర్మం)తప్పలేదు... 
భక్తి బాటలో నీ దారి(శివసేవ)మరువ లేదు...
జానెడు పొట్ట కోసమే ఈ నాటకం అంత...
నీ కింకరున్ని తండ్రి దయచూపు... 

మహాదేవా శంభో శరణు...
ఓం పరమాత్మనే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...