Saturday, September 23, 2023

శివోహం

విశిష్టత లేని ఈ పాత్ర లో  ఇంకా ఎన్ని రోజులు నటించాలి తండ్రి...

శివ నీ దయ.

శివోహం

వెలితి వెలితిగానే ఎన్నిరోజులు ఉంటుందో చూద్దాం...
శివుడి దయతో వెలుగు రాకుండా పోదా వెలివేసిన ఈ జీవితం వెలిగిపోదా...

శివ నీ దయ.

Friday, September 22, 2023

శివోహం

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం...
ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు....
అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు.... భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు.... దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు...
ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు....

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శివా!నింగి నేల నిన్ను తాకక నిలువ లేవు
నింద యన్నది నిను చేరి నిలువలేదు
నీ స్మరణలేని క్షణం ఈ బ్రతుకు లేదు
మహేశా . . . . . శరణు .

శివోహం

సత్యమనగా జగత్తును నాటకంగా ఆడించే పరమాత్మ...
అసత్యమనగా  జగత్తు పై జీవుడు పెంచుకున్న అనవసర మాయామోహం...
జీవుడు జగత్తు పై తాను పెంచుకొన్న మాయా మోహం లో తగుల్కొని విలపిస్తున్నంత సేపు మనస్సుకు శాంతి లభించదు...
జీవుడి లో సత్యమైన పరమాత్మ స్వరూపం ప్రకాశించినప్పుడే మనస్సుకు శాంతి విశ్రాంతి.

ఓం పరమాత్మనే నమః

శివోహం

శివా!నింగి నేల నిన్ను తాకక నిలువ లేవు
నింద యన్నది నిను చేరి నిలువలేదు
నీ స్మరణలేని క్షణం ఈ బ్రతుకు లేదు
మహేశా . . . . . శరణు .

Thursday, September 21, 2023

శివోహం

ఎప్పటి నుంచో తెలియదు కానీ...
ఈ హృదయంలో 'ఆశ' అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది....
కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి....
ఇంట్లోకి ఎలుక ప్రవేశించి నూతన వస్త్రాలను కొరికి పాడుచేసినట్లు, ఇది నా మంచి ప్రయత్నాలను, సత్ర్పవర్తనలను పాడు చేస్తోంది.
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...