Tuesday, September 26, 2023

శివోహం

అనంతంలో  ఆణువణువూ  ఆవరించి
అరుణోదయంతో, జాబిల్లితో  సంచరించి
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా 
మహాదేవా నీవే శరణు...

ఓం పరమాత్మనే నమః.
ఓం నమో వెంకటేశయా...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

కళ్ళకి గండి పడి కన్నీళ్లు గుండెను ముంచేస్తున్నాయి...
అడ్డుకట్ట వేస్తావో అభిషేకించుకుంటావో నీ ఇష్టం...

శివ నీ దయ.

Monday, September 25, 2023

శివోహం

శివా  ! ఎవరికి ఎవరు ?  నిశబ్ధ చైతన్యం నీవు , అనంత గుణ  గానం 
నాలో నీవు పాడుతూనే ఉంటావు అనేక మహా యుగాల పరిష్వంగన జన్మ బంధాలలో ఎత్తి లేస్తూ వస్తున్న ఎద్దును నేను కర్మలు , ఖర్మల కట్టెల అంటి కాలిపోతూ నన్ను చూసి ఒక  నవ్వు నవ్వుతావు నీవు గుర్తు ఉంది మళ్ళీ మామూలే నీకు నీవే నాకు నేనే శివా  ! నీ దయ

శివోహం

ఆర్తిగా పలకరించడానికి ఆకలి బాధను పెట్టావు...
కడుపు నిండాక కోరికలు కోటలు దాటిస్తావు...
తీరని కోరికలు తపనతో నీరసం నిస్సత్తువ...
అలసటలో మౌనంగానే నీ నామస్మరణ...
ఎలాగైనా సరే నీవైపు నడుపుకోవటానికి...
బాధలు పెట్టకు భవభయహరా...
మహాదేవా శంభో శరణు...

ఓం పరమాత్మనే నమః

శివోహం

ఎలా పోతామో తెలియని నీటి బుడగా లాంటి జీవితంలో ఇలాగే బతకాలని ఆలోచన అయితే ఏమి లేదు కానీ నిత్యం నీ నామ స్మరణ ఉండేట్లు చూడు...
శివ నీ దయ.

Sunday, September 24, 2023

శివోహం

కంఠం లో విషం...
పైకి నవ్వు...
అచ్చం నీ లాగే మా బంధువులు కూడా.
శివ నీ దయ...

శివోహం

శివా!నీ సిగ చేరిన ఆకాశ గంగ
పుడమి దాటి పాతాళమును చేరు వేళ
ఎటుల చిక్కెనో నాకంటి కొలనులో
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...