Friday, October 6, 2023

శివోహం

నీవు నల్లరాయి...
నేను బండరాయి...
నువ్వే నేను నేనె నువ్వు...
శివ నీ దయ.

శివోహం

శివా!అభయమీయగ నిన్ను అర్ధించునటుల
చరణాల చుట్టి శరణమంటున్న వాసుకికి
నేను వారసుడనయ్యా నన్ను ఆలకించు
మహేశా . . . . . శరణు .

శివోహం

నమక చమకలతో సాగె నీ అభిషేకం...
యమక గమనలతో సాగె నీ కీర్తనం...
నిరతిశయా ఆనందాలకు చిరునామా...
మహాదేవా శంభో శరణు.

ఓం పరమాత్మనే నమః.

Thursday, October 5, 2023

శివోహం

శివా!చిత్రాలు చూపేవు శివమెత్తి ఆడేవు
చిత్తాన జ్యోతిగా చమురు లేకే వెలిగేవు
మొత్తానికి మాకంతా ఆటలాగ చూపేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

లౌకిక సంభాషణలు
అహానికి ఆజ్యాలు
గుణ సంగమాలు
వ్యర్థ కలాపాలు
అసూయలకు ఆనవాలు
మానసిక దుర్భలతకు నిదర్శనాలు
భావాల కోటలు
ఉన్నతికి పెను అడ్డంకులు
మన భావాలే మనకు శాపాలైనపుడు
ఇతరుల భావాలు కూడా గ్రహించనేల
కల్లోలంతో మది నిండనేల 
వాచాలత్వం వలదు వలదు
అంతఃమననంలో నిధనం కలదు
మౌనమే సర్వ శ్రేష్ఠం
ధ్యానంలోనే ప్రశాంతమౌను చిత్తం.
ఓం నమః శివాయ.

శివోహం

క్షీరసాగరమధన సమయాన లోకాల కాపాడనెంచి
గరళాన్ని పాయసమువలె తీసుకుని గొంతున ఉంచి
హరా...
నీకొరకై అమ్మ గంగమ్మ-సతి పార్వతి
నిరంతరం అభిషేకించినా, చల్లారని నీగొంతున వేడి
క్షీర, మధుర రసాలతో అందరూ చేసే చిరు అభిషేకాలకు
పొంగిపోయి, గుండెలనిండుగ మము దీవించ నీగణ
సమేతముగ వచ్చి దీవించు చుంటివి గండర గండా...

నిను ప్రార్ధించిన నీపరీవారమంతా ఒక్కటై నను
దీవించు చున్నారు...
అందరూ - అగణిత ఆశీర్వచనములందించు చున్నారు...

నేనేమి చేయగలను పూజలు-పుణ్యకార్యాలు
శివనామస్మరణం తప్ప....

మహాదేవా శంభో శరణు,

శివోహం

వరుసగా తగులుతున్న బలమైన దెబ్బలకు ఎదో పొందుతున్న సంకేతాలు అందుతుంది...
నాకేమో నిన్ను చూడలని ఉంది...

శివ నీ దయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...