Sunday, October 8, 2023

శివోహం

అధ్బుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణ గణ అమృత శివ...
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ
సుందర రూప సురేశ
శివ ఈశ సురేశ మహేశ
జన ప్రియ కేశవ సేవిత
పాద శివ ఉరగాది ప్రియ భూషణ శంకర
నరక వినాశ నటేశ శివ
ఊర్జిత  దానవ నాశ
సాంబ సదాశివ
ఓం శివోహం... సర్వం సర్వం శివమయం.

శివోహం

నేను బతకడానికి ఇంత కష్టపడుతున్న...
నీవు నా కథ రాయడానికి ఎంత కష్ట పడి ఉంటావో కదా శివ...

శివ నీ దయ.

శివోహం

శివా!ఉన్మత్తుల కూడి వూరేగు వాడా
ఉండి వుంటావు నీవు వూరూ వాడా
ఐనా అందకుంటావు మాకు,ఇదేమి లీల
మహేశా . . . . . శరణు .

Saturday, October 7, 2023

శివోహం

కాలం కక్ష్య కట్టిన...
కష్టం పరీక్ష పెట్టిన అలసి పోతానేమో కానీ ఓడిపోను...
ఎందుకంటే ముందుండి నడిపించే నా శివుడే నాకు రక్ష..
శివోహం.. సర్వం శివమయం.

శివోహం

నమోకేశవ...
నమోనారాయణ...
నమోమాధవ...
నమోగోవింద...
నమోవిష్ణు...
నమోమధుసూధన...
నమోత్రివిక్రమ...
నమోవామన...
నమోశ్రీధర...
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ...

శివోహం

ఎక్కడ మనకు ప్రశాంతత దొరుకుతుందో...

అక్కడ సాక్షాత్తు భగవంతుడు కొలువై ఉంటాడు...
ఓం నమః శివాయ

Friday, October 6, 2023

శివోహం

ఇంత చక్కగా ఎలా ఉంటావు శివ... 
అంత ధ్యానము నీకేల జ్ఞానేశ్వరా...
గంగమ్మ నీ కొప్పున కొలువైనందుకా
లేక నెలవంక నీ శిరస్సున ఉన్నందుకా 
పార్వతీదేవి నీ పక్కన ఆసీనురాలైనందుకా...
లేక హిమగిరులు నీ నివాసము ఐనందుకా...
మెడలోన నాగేంద్రున్ని ధరించినందుకా...
లేక కైలాసమే నీ క్షేత్రము ఐనందుకా...
మాక్కూడా తెలపవయ్య సర్వేశ్వరా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...