Tuesday, October 10, 2023

శివోహం

శివా!బ్రతుకు పొలమున భక్తి హలమును పట్టి
జ్ఞాన వైరాగ్యములు పండించ నిన్ను  కొలిచి
సేధ్యము చేయ బూనితి కాస్త సహకరించు
మహేశా . . . . . శరణు .

శివోహం

నెత్తిన తైతక్కల గంగ...
నుదుటన నిప్పులుమిసే కన్ను...
కంఠాన విషపు కొలిమి మేన కాష్ఠపు బూది చాలవా నీకు...
బహు తిక్కల రేడు వని తెలుప ఈ విన్యాసమేలా...

మహాదేవా శంభో శరణు

శివోహం

నెత్తిన తైతక్కల గంగ...
నుదుటన నిప్పులుమిసే కన్ను...
కంఠాన విషపు కొలిమి మేన కాష్ఠపు బూది చాలవా నీకు...
బహు తిక్కల రేడు వని తెలుప ఈ విన్యాసమేలా...

మహాదేవా శంభో శరణు

శివోహం

సర్వలోక నాయకా
శ్రీ ఆశ్రిత రక్షకా
శ్రీ సర్వసంపద దీపికా
శ్రీ దేవి వల్లభా
శ్రీ అభయప్రధాతా
శ్రీ పద్మనాభా
శ్రీ వేణునాదామృతా
శ్రీ వేంకటేశ్వరా శరణు...

శివోహం

బతికున్నపుడు ఛీ ఛీ అంటున్నారు కానీ మరణించాక  శవం అంటారు...
శవం ను కలిస్తే బూడిద అంటారు...
బూడిద నే కదా శివం అంటారు...  

శివోహం

Sunday, October 8, 2023

శివోహం

ఉండు...
ఊరికే ఉండు...
మౌనం గా ఉండు...
కోపం, బాధ, అవమానం, ఆక్రోశం ఇలా విభిన్న భావాలు మనల్లి చుట్టుముడతాయి...
ఈ ఆందోళన మనల్లి కృంగదీస్తుంది...
మనకు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు... అటువంటి సమయంలో మౌనమే శరణ్యం...
ఓం నమః శివాయ.

శివోహం

శివా ! రేపటి నీ ఆశలకై ఎదురు చూస్తూ
నిన్నటి నీ అనుభవాల జ్ఞాపకాల దొంతరలో
నా కన్నీటి సంద్రం లో ఒక కన్నీటి పొర నీకోసం మిగిలే ఉంది
నీవు కనపడితే పాదాలు కడగడానికి 
శివా ! నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...