Thursday, October 12, 2023

శివోహం

నా దేహం తొమ్మిది తొర్రలా అద్దె కొంప...
ఈ అతుకుల బొంతకి ఆత్మబందువు నీవే కదా ఈశ్వరా...

శివ నీ దయ.

శివోహం

ప్రకృతిలోని భోగాలన్నింటినీ అనుభవించాలని తాపత్రయపడుతూ ఉంటాం...
కానీ ఆ ప్రకృతే మన సర్వస్వాన్నీ సంగ్రహంచి, శక్తిని సంపూర్ణంగా హరించి పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది.

ఓం శ్రీమాత్రే నమః.

Wednesday, October 11, 2023

శివోహం

శివా!తిప్పి వదిలేసావు తాడులేని బొంగారాన్ని
ఆ తిరుగుడు ఎన్నాళ్ళైన వొరిగిపోవు ఓనాటికి
మూన్నాళ్ళ ముచ్చటే ముమ్మాటికి
మహేశా . . . . . శరణు .

శివోహం

తట్టుకోలేని బాధలు నీవు ఎన్ని ఇచ్చిన నిత్యం నీ నామమే తలుపుతడుతోంది...

శివ నీ దయ.

శివోహం

నీ కాంతి బిందువుల నుండి పుట్టిన ఈ మట్టిలోని అణువణువూ తిరిగి నీలో ఐక్యం కావాలని 
పరితపిస్తూ ఉంది కాంతికి కలిగిన కోరికలు
మట్టికి అనుభవాలు అనుభవాలు జ్ఞానమై
జ్ఞానం సత్యమై
సత్యం శివమై
శివమ్ సుందరంగా 
ఆవిష్కరణ చెందిన క్షణం నేను నీలోకి ఐక్యం.
ఓం శివోహం...సర్వం శివమయం.

Tuesday, October 10, 2023

శివోహం

ఉంచుకోడం లోకన్నా పంచుకోడంలో ఎక్కువగా ఆనందాన్ని తృప్తినీ పొందేది...
పరమాత్మ తత్వ చింతనతో మనసు పండితేనే అలాంటి నిష్కామ ప్రవృత్తి అలవడుతుంది...

జై శ్రీరామ్...జై హనుమాన్
జై శ్రీమన్నారాయణ
ఓం పరమాత్మనే నమః
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా ! తలచిన శివుడే , తలపున శివుడే, తలపులోన శివుడే, గడపన శివుడే, గడుపును శివుడే, కడుపున శివుడే, నడచిన శివుడే, నడుపును శివుడే , కుడిచిన శివుడే, తడబడు అడుగులు నడుపును శివుడే, గనపడ గనపడి శివుడే, వగచిన శివుడే, పిలిచిన శివుడే, మలచిన శివుడే, సగమున శివుడే, నగవున శివుడే, శివా నీ దయ శివా నీ దయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...