Sunday, October 15, 2023

అమ్మ

దధానా కరపద్మాభ్యాం  అక్షమాలాకమండల:
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా...

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది.

శివోహం

శిక్షించడం దైవ నిర్ణయం కాదు...
పరీక్షించడమే దైవ మార్గం...
చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే...
మనిషి చేయగలిగిన కర్మమార్గం...

ఓం పరమాత్మనే నమః.

శివోహం

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం...
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్...

ఓం శైలపుత్రినే ( బాలా త్రిపుర సుందరి) నమః

Saturday, October 14, 2023

ఓం

ఒక అంకం  ముగిసిపోతున్నది
నీవు ఏర్పరచిన జగన్నాటక రంగంలో 
ఒక పాత్ర ముగిసిపోతున్నది 

పాత్ర ఔచిత్యంలో నేను నా పాత్రకు 
న్యాయం చేసానో 
నటించానో 
జీవించానో 
నిర్ణయించే సమయం ఆసన్నమైంది 

ఏమి పొందానో 
ఏమి కోల్పోయానో 
ఏమి కోరుకున్నానో 
ఏమి ఆశించానో 
ఏమి వదులుకున్నానో 
ఏమి వదలకున్ననో 
ఏమీ జ్ఞప్తికి లేవు 

నా అస్థిత్వానికై 
పడిన తపన 
పొందిన ఆరాటం 
జరిపిన జీవన పోరాటంలో
నీ అస్థిత్వాన్ని గమనించక 
వృధా పరచిన కాలమెంతో 
నా అజ్ఞానాన్ని 
మన్నించి కరుణించు 

ఎంతో ఆరాటపడి 
ఎన్నో సంపాదించా 
విలువైన నీ సన్నిధి వదిలి
వెలలేని విషయాలను పట్టుకున్నా 
అంకెను వదిలి 
సున్నాలను మాత్రమే ఎర్పరచుకున్న
నా అమాయకత్వాన్ని 
దయతో మన్నించు 

అవసరమైన 
నీ అనుగ్రహాన్ని మాత్రము మరచి
అనవసరమైన 
ప్రతి విషయంలో మైమరచిపోయా 
శాశ్వతమైన నీ బంధాన్ని వదిలి
అశాశ్వతమైన బంధాలకు బందీయైన 
నా మూర్ఖత్వాన్ని 
వాత్సల్యంతో మన్నించు 

పశ్చ్యాత్తాపముతో పరితపించే జీవులకు 
నీ పద కమలముల శాశ్వత సన్నిధి ఒసగగల 
బోళా శంకరుడివని నమ్మి 
అవసాన సమయములో అర్ధిస్తున్నాను తండ్రీ 

నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు 
ఈ జన్మకైనా మరే జన్మకైనా 
నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి 
నీచెంతనే నిలిచేలా అనుగ్రహించే 
బాధ్యత 
భారము నీదే
శివయ్యా  :'

శివోహం

నాలుగు ఉలి దెబ్బలు తిని ఓ రాయి శివలింగం అయింది...

ఎన్నో బాధలు తిన్న ఈ రాయి నీ కూడా శిల్పం చేయవయ్య...

శివ నీ దయ.

Friday, October 13, 2023

శివోహం

శివ...
నా మనసు స్వేచ్చాపశువు గా తిరుగుతోంది...
నీ నామ సంకీర్తన అనే మేత వేసి నీ లీలల పాశంతో కట్టివుంచు...
ప్రతి రోజూ నా ఈ జన్మ సార్థకం తెలియజేస్తూ నా యజమాని నీవే అనే స్మరణ తేరాదు.

మహాదేవా శంభో శరణు.
ఓం పరమాత్మనే నమః.

Thursday, October 12, 2023

శివోహం

శివా ! వెర్రెత్తి వస్తోంది గంగమ్మ చూడు 
తల ఎత్తి తల లోన జల చుట్టి సిగలోన 
మెలిపెట్టి వగలాడి గంగమ్మ బిగువంత 
వలపట్టి  జగమంత ఓహో అని 
ఎలుగెత్తి పిలువంగ శివ గంగ జంగమ దేవయ్య 
సరి గంగ స్నానాలు చేయంగ నిలిచి

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...