Saturday, October 14, 2023

ఓం

ఒక అంకం  ముగిసిపోతున్నది
నీవు ఏర్పరచిన జగన్నాటక రంగంలో 
ఒక పాత్ర ముగిసిపోతున్నది 

పాత్ర ఔచిత్యంలో నేను నా పాత్రకు 
న్యాయం చేసానో 
నటించానో 
జీవించానో 
నిర్ణయించే సమయం ఆసన్నమైంది 

ఏమి పొందానో 
ఏమి కోల్పోయానో 
ఏమి కోరుకున్నానో 
ఏమి ఆశించానో 
ఏమి వదులుకున్నానో 
ఏమి వదలకున్ననో 
ఏమీ జ్ఞప్తికి లేవు 

నా అస్థిత్వానికై 
పడిన తపన 
పొందిన ఆరాటం 
జరిపిన జీవన పోరాటంలో
నీ అస్థిత్వాన్ని గమనించక 
వృధా పరచిన కాలమెంతో 
నా అజ్ఞానాన్ని 
మన్నించి కరుణించు 

ఎంతో ఆరాటపడి 
ఎన్నో సంపాదించా 
విలువైన నీ సన్నిధి వదిలి
వెలలేని విషయాలను పట్టుకున్నా 
అంకెను వదిలి 
సున్నాలను మాత్రమే ఎర్పరచుకున్న
నా అమాయకత్వాన్ని 
దయతో మన్నించు 

అవసరమైన 
నీ అనుగ్రహాన్ని మాత్రము మరచి
అనవసరమైన 
ప్రతి విషయంలో మైమరచిపోయా 
శాశ్వతమైన నీ బంధాన్ని వదిలి
అశాశ్వతమైన బంధాలకు బందీయైన 
నా మూర్ఖత్వాన్ని 
వాత్సల్యంతో మన్నించు 

పశ్చ్యాత్తాపముతో పరితపించే జీవులకు 
నీ పద కమలముల శాశ్వత సన్నిధి ఒసగగల 
బోళా శంకరుడివని నమ్మి 
అవసాన సమయములో అర్ధిస్తున్నాను తండ్రీ 

నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు 
ఈ జన్మకైనా మరే జన్మకైనా 
నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి 
నీచెంతనే నిలిచేలా అనుగ్రహించే 
బాధ్యత 
భారము నీదే
శివయ్యా  :'

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...