Thursday, October 26, 2023

శివోహం

నీ గానం విననిదే నా చెవులకు ఆనందం లేదు...
నీ దేవాలయం దర్శించనిదే నాకు కళ్ళకి సంతోషం రాదు...
నీ నామ స్మరణ చేయకుంటే నా మనసుకు ఏమీ తోచదు...
ఎన్నాళ్లని ఈ ఎదురుచూపులు , ఇన్నేళ్లు ఈ ఎడబాటు...
ఈ గుండె మంటలార్పడానికి ఎన్ని కన్నీళ్ళు కార్చాలి నేను
ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు ఈ కన్నీళ్లు....
కన్నీళ్ళతో మనసు తడిసి తడిసి ముద్దవుతోంది...
జాలి చూపి నీదరికి చేర్చు...
మహాదేవా శంభో శరణు.

Wednesday, October 25, 2023

శివోహం

శివ...
నీ దయ కలిగితే జీవులకు అన్నీ సిద్ధిస్తాయి...
దుఃఖాలు తొలగుతాయి...
లౌకిక సుఖములందు విరక్తులౌతారు...
జీవన్ముక్తులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు...
అందుకే నా హృదయమునందు నిర్మలమైన నీ జ్ఞాన పరమానంద రూపము ప్రకాశించేలా అనుగ్రహించు తండ్రి...
దానివల్ల కలిగే ఆనందనుభవంచే అలవికాని నా బాధలను మరిచిపోయి నీ పాదపద్మ ఆరాధనయందు ప్రీతి ని భక్తినీ పొందే అదృష్టాన్ని ఈ జీవుడికి ప్రసాదించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శృతి చేసి చూడు నా మదిని పలుకుతుంది నీ నామమే మోహనారాగం లో.
నాట్యమాడు తనివితీరా నా హృదయం లో.

శివ నీ దయ.

శివోహం

శివా!జనన మరణములు సంహరము చేసి
జగతి చక్రము నీవు తిప్పు చున్నావు
ఆ చక్రగతిని నా గతి తప్పించవయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి...
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె...
మలినాలతో మనసు ముసురుకొని వున్నాది...
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా...
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నందిపై వున్నావు నిందలేకున్నావు
నరునిలో వున్నావు నడిపించు చున్నావు
నిన్ను తెలియగ నన్ను నడిపించవయ్యా
మహేశా . . . . . శరణు .

Monday, October 23, 2023

శివోహం

అందరితో కలసి జీవించి మరణించాక శరీరం తేలికగా ఉంటుంది ఆ నలుగురికి...

నిత్యం స్వార్థం తో జీవించి మరణించాక మోయలేనంత భారంగా ఉంటుంది

*ఓం నమః శివాయ*

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...