Saturday, November 4, 2023

శివోహం

మనసుకు దాహం తిరటం లేదు...
నీ నామం ను ఎన్ని సార్లు జపించిన...

శివ నీ దయ.

Friday, November 3, 2023

శివోహం

తల్లితండ్రులను...
గురువులను
ధర్మమును వేదమును
ప్రేమిస్తున్నాము
కష్ట  సుఖములను ప్రకృతి  ననుసరించి అనుభ విస్తున్నాము..
లోకవ్యవస్థను ధర్మమార్గమున మార్చుటకు నిన్నేపార్దిస్తున్నాము.
శ్రీహరి శరణు.

ఓం నమో వెంకటేశయా.
ఓం పరమాత్మనే నమః.

శివోహం

కష్ట, సుఖాలలో నాకు తోడుగా ఉన్న ఆత్మ బంధువు నీవు...
నీ నామమే నను నడుపుతున్న బలం...
కృతజ్ఞతలు శివా.

శివ నీ దయ.

Thursday, November 2, 2023

శివోహం

శివ ఎన్ని కన్నీటి వర్షాలు కురిసిన...

గుండె మంటలారాటం లేదు...

నీ ధ్యాసలో మసలిన ఘఢియలోనే కొద్దిపాటి ఊరట

శివ నీ దయ.

శివోహం

శివా!నందిని కూడి నడచి వచ్చుట
ఈ వూపున నా మోపున చేర ముచ్చటా
ఆ ముచ్చట తీరనీ ఆ ఫలము నాకందనీ .
మహేశా  .  .  .  .  .  శరణు. .

శివోహం

శివ ధర్మశాసనం లేనిచో...
గ్రహాలకు చలనం లేదు...
వెలుగు ప్రసరించదు...
నీరు ప్రవహించదు...
గాలి వీయదు...
భూమి మొలకెత్తదు...
అంతా శూన్యం...
ఆయనే ధర్మం... 
ఆయనే శాసనం...
ఆయనే చైతన్యం...
ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, November 1, 2023

శివోహం

ఏంటో లేవగానే కొంచెం మనశ్శాంతి ఇవ్వు అమ్మ అని రోజూ కోరుకోవాల్సి వస్తుంది...
ఈ గజిబిజి ,ఆరాట,ఆలోచనల బ్రతుకు పోరాటాల్లో మనశ్శాంతి కరువయ్యిందే తల్లి...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
ఓం శ్రీ మాత్రే నమః.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...