Thursday, November 9, 2023

శివోహం

జీవిస్తున్న నీ నామాన్నే ఊపిరిగా ద్యానిస్తూ శ్వాసిస్తూ...

శివ నీ దయ.

శివోహం

శివా!కర్మ అకర్మలు కూడివున్నాను
జ్ఞాన అజ్ఞానాల తిరుగాడు చున్నాను
ఏ బాట తిరిగినా నీ బాట చేరనీ.
మహేశా . . . . . శరణు .

శివోహం

నా మనసుకు గాయలెక్కువైన కొద్దీ అలపిస్తుంది మధురమైన నీ నామం ను.

శివ నీ దయ.

Wednesday, November 8, 2023

శివోహం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం.

శివోహం

శివా!నేత కొచ్చిన బట్ట  కట్టుకోవు
మెడనైనా మేలి బంగారం పెట్టకోవు
సిరుల ప్రదాతా నీకు ఇది ఏమి రోత
మహేశా . . . . . శరణు .

Tuesday, November 7, 2023

శివోహం

శివ
తప్పని పరిస్థితిలో...
జానెడు పొట్ట నింపుకోవడం కోసం
పాట్లుపడుతూ జాలిగా నాలో నిన్ను చూసుకుంటూ ...

నీకు  దూరమైపోతున్నానేమోనని‌,
గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తుని ఊహించుకుంటూ...

మధ్యమధ్య క్షణాలలో 
మహాదేవా, నమఃశివాయ అనుకుంటూ 
ఏదోలా‌ ఉబుసుపోక కాలం వెళ్ళదీస్తూ...
మన్నించు మహాదేవా, శంకరా మన్నించు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

సుఖ:దుఖాలు కల్పించేది నివేనని తెలుసు...
ప్రకృతిని జీవరాసిని అనుక్షణం రక్షించేది కూడా నీవేనని తెలుసు...
సుఖం వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది అది నీవే కల్పించవని గ్రహించలేను...
కానీ ద:ఖం వచ్చినప్పుడు కుమిలిపొతూ కష్టాలు తొలగించమని నిన్నే ప్రార్థిస్తున్నాను.
మహాదేవా శంభో శరణు.

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...