శివ
తప్పని పరిస్థితిలో...
జానెడు పొట్ట నింపుకోవడం కోసం
పాట్లుపడుతూ జాలిగా నాలో నిన్ను చూసుకుంటూ ...
నీకు దూరమైపోతున్నానేమోనని,
గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తుని ఊహించుకుంటూ...
మధ్యమధ్య క్షణాలలో
మహాదేవా, నమఃశివాయ అనుకుంటూ
ఏదోలా ఉబుసుపోక కాలం వెళ్ళదీస్తూ...
మన్నించు మహాదేవా, శంకరా మన్నించు.
No comments:
Post a Comment