మనం చేసిన తప్పులను గురించి తరచితరచి ఆలోచించడం, మరక పైన మరక వేసుకోవటం లాంటిదే. మనలను మనం నిందించుకుంటూ చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకము చేసుకుంటు-ంటే అవి మరింత గాఢముగా మనలను బాధపెడుతాయి మరియు బలహీనపరుస్తాయి.
తప్పును ఒప్పుకొని దాని నుంచి పాఠాన్ని నేర్చుకున్నప్పుడు మనము సశక్తికరణ చెంది, వివేకముతో, ధైర్యముగా అన్నింటిని దాటు-కొని ముందుకు వెళ్ళగలం. ఈ రోజు నేను తప్పులు చేయకుండా ఫుల్ స్టాప్ పెట్టి ఉపశమనం పొందుతాను.