Wednesday, December 13, 2023

శివోహం

తొలివలపు రోదన సరే కానీ చివరి రోదనలా వినిపిస్తుంది ఏంటో నా మది కి.
అపశకునమవుతూ నా మనసు ముంగిట్లో.

శివ నీ దయ.

Monday, December 11, 2023

శివోహం

శివా!కార్యము తీరగ  భారము మోసావు
భారము తెలిసి భావము పంచేవు
ముక్తిని వొసగగ బంధములు త్రెంచవా
మహేశా . . . . . శరణు .

Sunday, December 10, 2023

శివోహం

శివా ! నీ కోసం అడుగేస్తే
నా కోసం గుడి కట్టేశావు
నీ మది గూడులో నను నిలబెట్టేశావు
శివా ! నీ దయ

శివోహం

అబద్దం
అంతా అబద్దం
బందాలు  అబద్దం
నీ చుట్టూ బంధుత్వాలు అబద్ధం
తరిగిపోయే వయసు అబద్దం
కరిగిపోయే అందం అబద్దం
నువ్వు అబద్దం
నీ తనువు అబద్దం
నీ బ్రతుకే పెద్ద అబద్దం
శివుడే నిజం
శివుడొక్కడే నిజం.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నీ కొప్పులోన కులికింది గగన కుసుమం
నా గుండెలోన కొలువుంది ఎద కుసుమం
నా గుండెలోకి చేరి జత కూడనీ గగన కుసుమం.
మహేశా . . . . . శరణు .

Saturday, December 9, 2023

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప...
నీ నామస్మరణలో ఇహపరాలు రెండూ గుర్తుండవు..
శరీరము తో పాటు...
మనసు నీరూపంతో ఐక్యమైపోతూ 
ఆనందాన్ని అనుభవిస్తూ 
నీతో చిందులు వేస్తూవుంటుంది. ...
చెప్పుటకు సాధ్యముగాని ఆనందము...
నిత్యం ఉండేలా అనుగ్రహించు.
హరిహారపుత్ర అయ్యప్ప స్వామి శరణు.
మణికంఠ స్వామి శరణు.

ఓం పరమాత్మనే నమః

శివోహం

గతం గరళమయ్యింది...
గొంతు మూగబోయింది.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...